దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటం కలకలం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక ప్రదేశాలతో పాటు.. మ్యూజియాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మే 15వ తేదీ వరకు వీటిని మూసివేస్టున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. సాంస్కృతిక,పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా దీనికి సంబంధించిన ఉత్తర్వులను ట్వీట్టర్లో ట్వీట్ చేశారు.
https://twitter.com/ANI/status/1382937699984711681