అమెరికాలో కుల వివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటెల్ నిలిచింది. ఈ మేరకు సియాటెల్ నగర కౌన్సిల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కుల వివక్షను చట్ట విరుద్ధం చేయాలని అమెరికాలోని దక్షిణాసియా ప్రజల నుంచి డిమాండ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను ఇండియన్ అమెరికన్ క్షమాసావంత్ తీసుకురాగా…
మంగళవారం జరిగిన ఓటింగ్లో 6-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. భారతీయులు పెద్దసంఖ్యలో ఉన్న అమెరికాలో ప్రస్తుత మనవాళ్ల జనాభా 27 లక్షలపైనే. కొంతకాలంగా అనేక కాలేజీలు, యూనివర్సిటీలు కుల వివక్షను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. వాటిలో బోస్టన్ లోని బ్రాండీస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, కాల్బీ కాలేజ్, బ్రౌన్ యూనివర్సిటీ,హార్వర్డ్ యూనివర్సిటీలున్నాయి.