జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కర్నెశ్రీశైలం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే గతనెలలో హోలీరోజున డయాలసిస్ చేయించుకుని ఇంటికివెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో ఆయన తలకు గాయమైంది. కోమాలోకి వెళ్లిపోయారు. వైద్యుల చికిత్సతో రెండురోజులుగా క్రమంగా కోలుకుంటున్నారు. నిమ్స్ నుంచి తరలించాలని భావిస్తుండగానే హఠాత్తుగా పరిస్థితి మళ్లీ క్షీణించి కన్నుమూశారు. ఈక్రమంలో ఇవాళ ఆయన ఆరోగ్యం విషమించింది. పోస్టుమార్టం అనంతరం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ కు తరలించనున్నారు. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నె శ్రీశైలం హఠాన్మరణం పట్ల పలువురు ప్రముఖులు దిక్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)