హిందూసమాజం నుంచి వెల్లువెత్తిన ఆందోనళల నేపథ్యంలో సరిగమ మ్యూజిక్ కంపెనీ వెనక్కి తగ్గింది. సన్నీలియోన్ మధుబన్ పాట సాహిత్యం మారుస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే రాధాకృష్ణుల ప్రణయగీతంపై సన్నీలియోన్ చేసిన డ్యాన్స్ కు సంబంధించి హావభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో పాటను తొలగించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇవ్వడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సంగీత దర్శకుడైన షరీబ్ తన సొంత మతంపై…విశ్వాసాలపై ఇలాంటి డాన్స్ తో సాంగ్ కంపోజ్ చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. పాట లిరిక్స్ మారుస్తామని సరిగమ తన అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది.
కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి పాడిన పాటలో నటి సన్నీ లియోన్ నటించింది. సరిగమ మ్యూజిక్ కంపెనీ డిసెంబర్ 22న యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ‘మధుబన్ మే రాధ నాచే’ పాట ఆధారంగా దీన్ని రూపొందించారు. . పాటలో రాధ కృష్ణుల ప్రణయగాథను చెబుతూ చిత్రించిన డాన్స్ పై సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. హిందూమతాన్ని, విశ్వసించే దేవుళ్లను అపహాస్యం చేసేలా ఉందని అందరూ మండిపడ్డారు. అసలు సాహిత్యానికి, డాన్స్ కు పొంతన లేదంటూ నెటిజన్లూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతపై విరుచుకుపడ్డారు. హిందూ దేవత రాధను వర్ణించే పాటను పోర్న్ స్టార్ సన్నీ లియోన్ పై తీయడాన్ని ఖండిస్తూ అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ మండిపడ్డారు.