చీర స్మార్ట్ వేర్ కాదు..మీకు రెస్టారెంట్ లోకి అనుమతి లేదు. ఇదీ ఓ యువతికి ఎదురైన పరిస్థితి. ఈ ఘటన జరిగింది ఏ సౌదీకంట్రీలోనో లేక ఏ యూకే దేశాలు, యూఎస్ లోనో కాదు…సాక్షాత్తూ భారత్ లో. అదీ రాజధాని ఢిల్లీలో. తనను, చీర కట్టును అవమానించేలా ఉన్న ఆక్విలా రెస్టారెంట్ సిబ్బంది తీరును సదరు మహిళ వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక సోషల్మీడియాలో యాక్టివ్ గా ఉండే షెఫాలీ వైద్యా, వివేక్ అగ్నిహోత్రి లాంటి వాళ్లూ ఈ వీడియోను జతచేస్తూ ట్వీట్లు చేశారు. చీరలను ఎంతో ఇష్టపడే…చీరకట్టులోనే ఎక్కువగా దర్శనమిచ్చే ప్రముఖ కాలమిస్ట్, నేషనలిస్ట్ షెఫాలీ వైద్య భారత్ తో ఇదేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చీర స్మార్ట్ వేర్ కాదని ఎవరు నిర్ణయించారు. నేను యూఎస్, యూకేతో పాటు యూఏఈ సందర్శించినప్పుడు చీరధరించే రెస్టారెంట్లకు వెళ్లారు. అక్కడ నన్ను ఎవరూ ఆపలేదు. అలాంటిది భారత్ లోని రెస్టారెంట్లు డ్రెస్ కోడ్ పేరుతో చీర స్మార్ట్ వేర్ కాదని అనుమతించడం లేదు. ఇదెక్కడి వింత’ అని ఆమె ట్వీట్ చేశారు
https://twitter.com/anitachoudhary/status/1439864720358395914?s=20