సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శరత్ బాబుని ఇటీవలే బెంగుళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా శరీరంలో ఇన్ఫెక్షన్ పెరగడంతో కీలక అవయవాలైన ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ఆర్గాన్స్ పాడయ్యాయి. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
శరద్ బాబూ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. శ్రీకాకుళం జిల్లాలోని, ఆముదాలవలసలో జన్మించారు. మొదట సీనియర్ నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. స్పర్థలతో ఇద్దరూ విడిపోయారు.
హీరోగానే కాకుండా విలన్‌గానూ శరత్‌బాబు రాణించారు. దాదాపు 300 చిత్రాలకు పైగా చిత్రాల్లో నటించారు. .
                                                                    



