రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. ఈనెల 13 14 15 తేదీలలో మూడు రోజులపాటు సంక్రాంతి పండగ నెలకొని ఉంది. అయితే అనేక సందర్భాలలో ముందుగానే పండగ చేసుకోవడం ఆనవాయితీ.
ముఖ్యంగా తెలుగు నాట పాఠశాలల్లో నాలుగు రోజులు ముందే సంక్రాంతి సంబరాలు చేసేస్తూ ఉంటారు. ఉత్సవాల తర్వాత స్కూల్స్ కి సెలవులు ఇవ్వడం ఆనవాయితీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోనాల లోని.. వివేకానంద పాఠశాల లో ముందుగానే సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. .ఈ సందర్భంగా పిల్లల పోషకులకు, ముఖ్యం గా మహిళలకు రంగవల్లి పోటీలను నిర్వహించారు . అనంతరం బహుమతులను అందించారు.
వివిధ రకాల రంగులతో వేసిన రంగవల్లులు మంచి సందేశాత్మకంగా చాలా ఆకట్టుకున్నాయి..
అలాగే ముందస్తుగా వివేకానంద జయంతి వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణ చైతన్య, ఓరుగంటి ఇస్తారి, కోస్మెట్ శుద్దోధన్,
మునిగెల శ్రీధర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు, పాల్గొన్నారు.
More Photos :