బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున ఫురుషుల వెయిట్ లిప్టింగ్ 55 కేజీల విభాగంలో పోటీపడిన సంకేత్ సర్గర్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఒక్క కేజీ తేడాతో స్వర్ణం కోల్పోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్ జేలో 135 కేజీలు) ఎత్తి తన స్వర్ణ పతక లక్ష్యానికి కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు.
మలేషియాకు చెందిన బిబ్ అనిక్ 259 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. శ్రీలంకకు చెందిన దిలంక యోడగే (225 కేజీలు) కాంస్యం సాధించాడు.