రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా మారాయి. ముఖ్యంగా విద్యార్థులు యువత గంజాయికి అలవాటు పడటం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి వ్యాపారం మీద దృష్టి పెట్టిన పోలీసులకు కీలకమైన సమాచారం దొరికింది. దీని ఆధారంగా ముందుకు వెళితే రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మాఫియా కు డాన్ గా వ్యవహరిస్తున్నది ఒక లేడీ అని తెలిసింది.
గంజాయి లేడీ డాన్ సంగీతా సాహు ఒడిశా కు చెందినవారు. అక్కడ నుంచే రెండు తెలుగు రాష్ట్రాలలో గంజాయి నెట్వర్క్ నడిపిస్తుంది . అంతేకాదు,
ఇన్స్ట్రా గ్రామ్‌లో సినీ హీరోయిన్లా వీడియోలు పోస్టు చేస్తుంది.గంజాయి వినియోగం ఎక్కడ ఉంటే అక్కడి వెళ్లి గంజాయి వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. భువనేశ్వర్‌కు దగ్గరగా ఉండడంతో అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో మాట్లాడుతూ వారికి గంజాయిని సరఫరా చేస్తు ఉంటుంది. సంగీతా సాహు గంజాయి లేడీ డాన్ ధూల్‌పేట్ కేంద్రంగా పెద్ద దందా నిర్వహిస్తోంది.
తెలంగాణ ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి లేడీ డాన్ సంగీత ను అరెస్టు చేశారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఒడిశా వెళ్లిన స్పెషల్ టీం.. ఈ సక్సెస్ సాధించారు.