తెలుగువారి సినిమా దేవత సమంత మరోసారి తెర మీదకు వస్తున్నారు. అనారోగ్యం కారణంగా కొంత కాలం పాటు మేకప్ కి దూరంగా నిలిచారు. చికిత్సతో ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు. అందుచేత మరోసారి తెరమీద ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు . అటు అక్కినేని కుటుంబంతో విడాకుల వ్యవహారం కూడా ఒక కొలిక్కి వస్తోంది.
నిజానికి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఫాలోవర్స్ ను డైలీ పలకరిస్తూ ఉంటోంది. కొన్ని సార్లు హెల్త్ కు సంబంధించిన విషయాలు కూడా షేర్ చేస్తుంటోంది. సామ్ క్రేజీ పిక్స్ డైలీ ట్రెండింగ్ లోనే ఉంటుంటాయి. అయితే సమంత.. తాజాగా ఇంట్రెస్టింగ్ పిక్స్ అండ్ వీడియోస్ షేర్ చేసింది.
ఫస్ట్ పిక్ లో సామ్.. డీసెంట్ జంప్ సూట్ లో సింపుల్ గా పోజు ఇచ్చింది.
మరో ఫోటోలో వైట్ టీ షర్ట్, జీన్ ప్యాంట్ తో అట్రాక్ట్ చేస్తోంది. తన పెట్స్ పిక్స్ కూడా షేర్ చేసింది. ఓ పెట్ ను ఆడిస్తూ ముద్దు పెడుతున్న వీడియో పోస్ట్ చేసింది. కారు అండ్ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్న గ్లింప్స్ కూడా పంచుకుంది. ప్రస్తుతం సామ్ పిక్స్, వీడియోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇక త్వరలోనే సమంత.. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో సందడి చేయనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత కూడా రెండు మూడు ఆఫర్లకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది మొత్తానికి సమంత తన అభిమానులకి స్వీట్ న్యూస్ చెప్పినట్టుంది.