నాగచైతన్యతో విడాకులు తీసుకుని వరుసగా వార్తల్లో నిలుస్తున్న టాలీవుడ్ హీరోయిన్ సమంత కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగేలా కథనాలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ చానళ్లపై పరువునష్టం దావా వేశారు. సుమన్ టీవీ, తెలుగుపాపులర్ టీవీతో పాటు సీఎల్ వెంకట్రావు అనే అడ్వొకేట్ పై కూకట్ పల్లి కోర్టులో పిల్ వేశారు. తన పర్సనల్ లైఫ్ మీద అభ్యంతర వ్యాఖ్యలు, ఇబ్బందిపెట్టే, కించపరిచే వీడియోలు ప్రసారం చేశారని…తన గౌరవాన్ని భంగం కలిగిందంటూ ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.
విడాకుల సమయంలో తమిద్దరిని కొన్నిరోజులు వదిలేయాలని చైతూ, సమంత ఇద్దరూ మీడియోకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అయితే తాను అంత మర్యాదగా విన్నవించిన తరువాత కూడా…సమంతను టార్గెట్ చేస్తూ మీడియాలో ముఖ్యంగా సోషల్మీడియా రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేశారు. తన స్టైలిష్ ప్రీతంకు తనకు మద్య సంబంధం ఉందని…పిల్లలు వద్దన్నందునే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చాడని ప్రచారం చేశారు. వ్యక్తిగత దాడి సరికాదంటూ తరువాత కూడా సమంత విజ్ఞప్తి చేసింది. శ్రుతిమించితే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది కూడా. అయినా పలు సోషల్మీడియా చానళ్లు వెనక్కి తగ్గలేదు. దీంతో సుమన్ టీవీ, తెలుగుపాపులర్ టీవీ, తెలుగు టాప్ టీవీలతో పాటు సీఎల్ వెంకట్రావుపై అనే అతనిపై కేసు వేసింది సమంత.