మనచరిత్రలోని కొన్ని సమయాలు క్లిష్టమైనవి కీలకమైనవి ఉన్నాయి.
హర్షునికీ పృథ్వీరాజుకీ మధ్య మనరాజులపేర్లు మనకు చెప్పబడటం లేదు. మహమూద్ గజినీ దండయాత్రకు, మహమ్మద్ ఘోరీ దండయాత్రకు మధ్యగల 180సంవత్సరాల కాలఖండంలో మన దేశాన్ని పాలించినవారెవరు? వారేమి చేశారు? ఇదీ చెప్పబడటం లేదు.
అల్లాఉద్దీన్ ఖిల్జీ, తుగ్లక్ ల పాలనలో దక్షిణభారతం ఉన్నది ముప్పై సంవత్సరాలకంటే తక్కువకాలమే. కాకతీయరాజ్యానంతరం నెలకొన్న విజయనగర రాజ్యం మూడువందల సంవత్సరాలు దక్షిణాన మన సంస్కృతిని నిలబెట్టింది.
మేవాడ్ రాజ్యం ఏనాడూ విదేశీ ముస్లింలకు దాసోహ మనలేదు.రాణాప్రతాప్, శివాజ్ ఛత్రసాల్, లాచిత్ బడపుకన్ మొగలులను ఎదిరించిన తీరు నుండి ప్రేరణపొందిన వియత్నాం అమెరికావంటి అతిపెద్ద దేశంనుండి తననుతాను రక్షించుకోగల్గింది.
శివాజీతర్వాత వంద సంవత్సరాలలో అతని వారసులు మొగలుపాదుషాను శాసించగల స్థాయికి చేరుకున్నారు. అహమద్ షా అబ్దాలీ దాడిని ఎదుర్కొన్నది మహారాష్ట్రులుగా పేర్కొన్నబడిన హిందూ స్వరాజ్యపు రాజులే.
1498లో అడుగుపెట్టిన పోర్చుగీసులు, ఆతర్వాత వచ్చిన వళందలు, ఆంగ్లేయులు, ప్రెంచివారూ మన దేశంతో, ప్రజలతో ఆటలాడుకున్నారు. ప్రజలను పీల్చి పిప్పి చేశారు.
మరి ఈ పదునాలుగు వందల కాలఖండంలో మన వాళ్లు ఏమిచేశారు? స్తబ్దుగా పడియున్నారా? విరామ మెరుగనిపోరాటం సాగించారా? ఏ పోరాటమూ సాగించకుండానే నేటికీ వందకోట్ల ప్రజానీకంగా ఎలామిగిలి యున్నాం? గ్రీసు,రోమన్, ఈజిప్టు, మెసపటోమియా ప్రజలకు లభించని పుణ్యఫలం హిందువులకు మాత్రమే లభించడానికి కారణ మేమిటి?
ఆ కీలకమైన సమాచారాన్ని వెలికితీసి విశ్లేషించి మీముందుంచే ప్రయత్నంలో నిమగ్నమై యున్న సంస్థ నవయుగభారతి అందజేస్తున్న పుస్తకాలద్వారా ఇతిహాసపు చీకటికోణాలను సైతం మీరు దర్శించ గలరు. మనవైపునుండి సతత సంఘర్షణ జరిగిందనే సత్యాన్ని దర్శించగలరు. ఈ పుస్తకాలు ఈ విషయం లో మీ దాహాన్ని తీర్చగలవు.
1) మనజాతిచరితమిదిర (చిట్టా దామోదర శాస్త్రి)
2)హిందూదేశంపై ముస్లిముల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర (ప్రొ౹౹శరద్ హెబాల్కర్, అనువాదం బెల్లంకొండ మల్లారెడ్డి)
3)విద్యారణ్య విజయం(వి.వి. సుబ్రహ్మణ్యం)
4)శ్రీ కృష్ణదేవరాయల కీర్తిచంద్రిక (జాగృతి దీపావళి ప్రత్యేకసంచికలోని వ్యాసాలు- కూర్పు డా౹౹వడ్డి విజయ సారథి)
5) రాణాప్రతాప్ (డా౹౹పులిచెర్ల సాంబశివరావు)
6) జైభవానీ జైశివాజీ (పులిచెర్ల సుబ్బారావు)
7) వీరశివాజీ గాథలు వినుర వివేకానందుని మాటలలోన (అనువాదం:డా౹౹వడ్డివిజయసారథి)
8)హిందూ విజయ దుందుభి(శ్రీ రామ్ సాఠే, అనువాదం: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు)
9)హైందవ స్వరాజ్య అప్రతిహత పురోగమనం (ప్రొ౹౹యశ్వంత్ భావే, అను:బెల్లంకొండ మల్లారెడ్డి)
10)భారతదేశంలో విదేశీ ముస్లింపాలన పర్యవసానాలు (డా౹౹బి.సారంగపాణి)
11)భారతదేశ చరిత్రలో ఆరు స్వర్ణపత్రాలు (వినాయక దామోదర సావర్కర్, అను: కే.బి. సోమ యాజులు, కె.శ్యాంప్రకాశరావు, కస్తూరి రాకా సుధాకర రావు)
12) తెల్లచీకట్లు క్రమ్మిన వేళ (పులిచెర్ల సుబ్బారావు)
13) ఆంగ్లేయుల ఏలుబడి అంతులేనిదోపిడి (డా౹౹బి.సారంగపాణి)
14) స్వతంత్ర సమర జ్వాలలు (నా.వి.కాకత్కర్, అను: అగస్త్యరాజు ఏకాంత పురుషోత్తమరావు)
15)చరిత్ర పాఠాలను విస్మరిస్తే భవిష్యత్తు ఎలాఉంటుంది? (వినాయక దామోదర సావర్కర్ రచనలనుండి హిమానీ సావర్కర్ సంకలనం)
16)ఇదేమి చరిత్ర? (సీతారామ్ గోయెల్, అను: వి.వి. సుబ్రహ్మణ్యం)
పైపుస్తకాలన్నీ 27 డిశెంబరువరకు తెలంగాణ కళాభారతి ( ఎన్టీయార్ స్టేడియం)లో జరుగుతున్న పుస్తకమహోత్సవంలో సాహిత్యనికేతన్ (స్టాల్స్144- 146), నవయుగభారతి (స్టాల్స్171,172) విక్రయ కేంద్రాలలో లభిస్తున్నవి.
దర్శించండి. ప్రయోజనం పొందండి. మీమిత్రులకు తెలియజేసి మార్గదర్శులు కండి. సముజ్జ్వల భారత నిర్మాణంలో చురుకైన భాగస్వాములు కండి.
Dr.వడ్డి విజయ సారధి గారి సౌజన్యంతో