అసలు ఎలాంటి వార్త బయటికి పొక్కకుండా చాల జాగ్రత్తగా రష్యా తన కొత్త యుద్ధ విమానాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. దాని పేరు చెక్ మేట్.
విశ్లేషకులు అమెరికన్ లాక్ హీడ్ మార్టిన్ F -35 కి పోటీగా రష్యా తన చెక్ మేట్ ని రూపొందించినది అని విశ్లేషిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా కాదు కదా సగం కూడా నిజం లేదు దీనిలో.
రష్యా కొత్త జెట్ ఫైటర్ చెక్ మేట్ LTA [Light Tactical Aircraft] ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసింది కానీ అసలు F-35 కి దీనికి పొలీకే లేదు. తేలికపాటి వ్యూహాత్మక జెట్ ఫైటర్ అని పేరుపెట్టింది [ఈ విమానం ని చూస్తే అర్ధం అయిపోతుంది ] అటువంటప్పుడు F35 తో ఎలా పోలుస్తారు ? వీటిని అర్ధం చేసుకోవాలంటే పెద్దగా టెక్ నాలెడ్జ్ అవసరం లేదు కానీ కమర్షియల్ అంశాలు అర్ధం చేసుకుంటే సామాన్యుడు కూడా చెప్పగలుగుతాడు విషయం ఏమిటో !
రష్యా గురి భారత్ పైన ?
అవును! రష్యా భారత్ ని ఉద్దేశించే చెక్‌మేట్ ని తయారు చేసింది. ఆఫ్కోర్స్ ప్రస్తుతం ప్రదర్శనలో ఉంచింది ప్రోటో టైపు మాత్రమే ! ప్రదర్శనకి వచ్చిన దేశాలలో ఏదన్నా ఎంక్వైరీలు వస్తే దానిని బట్టి ముందుకు వెళ్ళి పోతుంది రష్యా ! విదేశీ నిపుణులు కావచ్చు లేదా విమర్శకులు కావచ్చు రష్యన్ టెక్నాలజీ ని అమెరికన్ టెక్నాలజీ తో పోల్చి చూస్తారు సహజంగా. ఇప్పుడు అదే చేశారు. కానీ కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే రష్యా చెకమేట్ భారత్ ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసింది అని చెప్పవచ్చు. రష్యా ఎగుమతుల్లో సింహ భాగం ఆయుధాలు, సహజ వాయువు, క్రూడ్ ఆయిల్ లు మొదటి భాగంలో ఉంటాయి. ఒకప్పుడు భారీ యంత్ర పరికరాలు లిస్ట్ లో ఉండేవి కానీ చైనా ఆ మార్కెట్ ని లాక్కొని 10 ఏళ్లు అవుతున్నది.
రష్యన్ చెక్ మేట్ Vs F-35 Vs Tejas MK-II.
Chekmate :
గత జులై నెలలో 20 నుండి 25 వరకు రష్యాలోని మాస్కో కి దగ్గరలో ఉన్న జుకోవిస్కీ ఎయిర్ పోర్ట్ [Zhukovsky Airport ] లో జరిగిన ఎయిర్ షో లో [MAKS-2021 air show ] మేట్ ని[proto type] ప్రదర్శించింది రష్యా. తన సుఖోయ్ సు -57 నుండి ప్రేరణ పొంది చాలా వరకు టెక్ ని దాని నుండి తీసుకొని డిజైన్ చేసింది కానీ పరిమాణం లో చిన్నదిగా ఉంది. పేరు కూడా లైట్ టాక్టికల్ ఎయిర్ క్రాఫ్ట్ అనే అంటున్నది రష్యా అలాటనప్పుడు దీనిని అమెరికన్ F-35 తో ఎలా పోలుస్తారు ? F -35 కి కౌంటర్ గా Su -57 ని మార్కెట్లో కి దించి చాలా కాలం అయ్యింది కానీ ఏ దేశం నుండి కూడా ఆర్డర్లు సంపాదించలేకపోయింది Su-57 దాంతో కొద్ది పాటి Su-57 లని తన ఎయిర్ ఫోర్స్ కి ఆర్డర్ ఇచ్చి దాని ప్రొడక్షన్ ని ఆపేసింది రష్యా. నిజానికి Su -57 ని భారత్ కి ఆఫర్ చేసింది రష్యా కానీ మన ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. ఏవియానిక్స్ విషయం లో కొంచెం సమయం తీసుకొని మనమే అభివృద్ధి చేసుకుంటే రష్యా కంటే బెటర్ ఏవియానిక్స్ ని మనమే తయారు చేసుకోవచ్చు అనేది మన అభిప్రాయం. 2016 లో 5 th జెనెరేషన్ జెట్ ఫైటర్ ప్రాజెక్ట్ నుండి [రష్యా భారత్ లు సంయుక్తంగా 5 th జెన్ ఫైటర్ జెట్ కోసం పరిశోధన & అభివృద్ధి మీద కలిసి పెట్టుబడులు పెట్టీ రెండేళ్ళు కొనసాగాయి ]భారత్ మధ్యలోనే విరమించుకుంది ఎందుకంటే ఏవియానిక్స్ విషయంలో కానీ,జెట్ ఇంజిన్ లో కానీ రష్యా అమెరికా కంటే 10 ఏళ్లు వెనక ఉంది కాబట్టి లాభం లేదని భారత్ మధ్యలోనే ఆ ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చేసింది. గత నాలుగేళ్లలో భారత్ మొదటి విజయం ఉత్తమ్ EASA రాడార్ ని విజయవంతంగా ఆవిష్కరించగలిగింది.
1. పరిశోధకులు ఇప్పటికిప్పుడు భారత్ తేజస్ ని పరిగణలోకి తీసుకోకపోయినా రాబోయే రెండు సంవత్సరాలలో తప్పకుండా జెట్ ఫైటర్ మార్కెట్ లో భారత్ ఒక పోటీదారుగా ఉంటుంది అనేది సత్యం. ADA,DRDO,HAL ఇప్పుడు ఉన్న విధంగా రాబోయే రెండేళ్లలో కూడా ఇదే స్పీడ్ ని కనుక ప్రదర్శిస్తే తప్పకుండా పోటీదారుగా మార్కెట్ లో ఉండగలుతుంది. రష్యా ఆలోచన కూడా ఇదే. తన భారీ Su-27 ఫ్లాట్ఫోరం మీద తయారు చేసిన Su-30,Su-35,Su-57 లలో కేవలం భారత్ మాత్రమే 270 Su-30 లని కొన్నది తప్పితే మిగతా దేశాలు కొద్ది సంఖ్యలోనే కొన్నాయి. ఇక లాభం లేదనుకొని భారత్ ఆలోచనని ప్రేరణగా తీసుకొని తేలికపాటి టాక్టికల్ ఫైటర్ తరగతి లోకి ప్రవేశించడానికి సిద్ధపడ్డది. రాబోయే కాలంలో చిన్న, మధ్య తరహా యుద్ధ విమానాల కేటగిరీ లో విజయవంతంగా మార్కెట్ ని ఆక్రమించుకునే అవకాశాలని రష్యా బాగానే గుర్తించింది.
2. పోటీ భారత్ నుండే ఎదురవవచ్చు రష్యాకి. తన మిగ్ -35 కి కూడా మార్కెట్ ని సంపాదించుకోలేక పోయింది రష్యా. మలేషియా తన Mig -29 ఫ్లీట్ ని వదిలించుకొని కొత్తగా లైట్ కాంబాట్ జెట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నది. భారత్ కావొచ్చు ,మలేషియా కావొచ్చు Mig -29 ల ఇంజిన్ల విషయం లో అనేక ఇబ్బందులు ఎదుర్కున్నాయి దాంతో మలేషియా రష్యా వైపు చూడడానికి ఇష్టపడట్లేదు. ప్రస్తుతం Tejas Mk -1A ల మీద ఆసక్తి చూపిస్తున్నది. ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిణామాలు కావు గత 3 సంవత్సరాల నుండి తన మిగ్ 29 లని వదలించుకొని Mig-35 లని కొంటుంది అని ఆశపడి భంగపడ్డది రష్యా ! మిగ్ ఇంజిన్ల కంటే సుఖోయ్ ఇంజీన్లు కాస్త బెటర్ అనిపించినా అవి అమెరికన్,యూరోపియన్ జెట్ ఇంజిన్ల తో పోటీ పడలేకపోతున్నాయి.
3. ఇక Tejas ఇంజిన్ల విషయం లో అమెరికన్ జెనెరల్ ఎలెక్ట్రిక్ GE-F414 ఇంజీన్లు కొని వాటిని TEJAS లకి వాడుతున్నది కాబట్టి ప్రధాన సమస్య అయిన ఇంజిన్ ప్రాబ్లెమ్స్ నుండి బయటపడిపోవచ్చు అని భావిస్తున్నాయి చాలా దేశాలు. తేజస్ మీద ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఇదే. గత 70 ఏళ్ళుగా దాదాపుగా 80% ఆయుధాలు,విమానాలు, ఇతర రక్షణ సామాగ్రి ని సోవియట్ రష్యా నుండే కొన్నది భారత్. Mig-21 లని అయితే దాదాపుగా 1100 వరకు కొన్నాం మనం. ప్రస్తుతం కూలిపోయినవి కూలిపోగా ప్రస్తుతం 120 మిలిగి ఉన్నాయి. తరువాత ఎక్కువ కొన్నవి Su-30 లు 270 కొన్నాము. మిగ్,సుఖోయ్ ల ఇంజిన్ల సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. ఇది మన దేశానికే కాదు రష్యా విమానాలు కొన్న అన్నీ దేశాలు ఇంజిన్ల సమస్యని ఎదుర్కొన్నాయి.
4. కాలం మారిపోయింది. ఇప్పుడు రష్యా విమానాలు కొనడానికి ఎవరూ సిద్ధంగా ఉండడం లేదు దాంతో జెట్ ఫైటర్స్ విషయంలో రష్యా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులని ఎదుర్కొంటున్నది. నిజానికి సోవియట్ యూనియన్ పతనం తరువాత రష్యా 10 ఏళ్ల పాటు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు వల్ల జెట్ ఫైటర్స్ మీద R&D ల విషయంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టలేకపోయింది దాంతో వెనకపడి పోయింది. Su-57 ఇంజిన్ విషయంలో తగినంత బలం లేకపోవడం వల్ల భారత్ ఆసక్తి చూపలేదు అలాగే ఇతర దేశాలు కూడా.
5. TEJAS Mark-1 A విషయంలో మలేసియా, వియాయత్నాం లతో పాటు ఇతర దేశాలు ఆసక్తి చూపడం అనేది రష్యాకి మింగుడు పడలేదు. నిజానికి వియాత్నాం,మలేషియాలు ఎప్పటి నుండో రష్యా ఖాతాదారులు అలాంటిది మెల్లగా రష్యా నుండి దూరంగా జరగడం అనేది పెద్ద నష్టం రష్యాకి. ఈ నేపధ్యం వల్లనే ఇప్పుడు రష్యా తన దారి మార్చి మీడియం ఫైటర్ జెట్స్ ని అదీ సింగిల్ ఇంజిన్ ఫైటర్ జెట్స్ మీద దృష్టి సారించింది.

6. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక అప్పటి సోవియట్ యూనియన్ తయారు చేసిన MIG-21 సింగిల్ ఇంజిన్ జెట్ ఫైటర్ విపరీతంగా అమ్ముడుపోయింది. 1950 దశకం చివరిలో మొదటి MIG-21 బయటికి వచ్చాక మళ్ళీ సింగిల్ ఇంజిన్ జెట్ ఫైటర్ ని తయారు చేయలేదు రష్యా.
7. ఇప్పుడు సింగిల్ ఇంజిన్ మీడియం వెయిట్ 5 th జెనెరేషన్ [అనుమానాలు చాలా ఉన్నాయి ] అంటూ ప్రదర్శనలో పెట్టింది రష్యా. చెక్ మేట్ ఆలోచన రాబోయే 5 ఏళ్లలో చాలా దేశాల జెట్ ఫైటర్స్ జీవిత కాలం ముగియబోతున్నది కాబట్టి ఆయా దేశాలు మళ్ళీ కొత్త జెట్ ఫైటర్స్ ని కొంటాయి కానీ ఈ సారి మరీ హెవీ వెయిట్ కాకుండా మధ్యస్థంగా ఉండే వాటి మీదనే దృష్టి పెడతాయి.
8. 2025 కల్లా భారత్ తన TEJAS MARK II ని లైమ్ లైట్ లోకి తీసుకువస్తుంది అదీ 4.5 జెనెరేషన్ ఫీచర్స్ తో మీడియం వెయిట్ విత్ స్టేల్త్ ఫీచర్ తో. ఇప్పటికే కొన్ని దేశాలు తమ కొనుగోళ్లని వాయిదా వేసుకొని TEJAS MARK-II కోసం వేచి చూస్తున్నాయి. ముఖ్యంగా ఇంజిన్ విషయంలో వాటి నిర్వహణ విషయంలో ప్రతి దేశం పూర్తి రక్షణ కోసం చూస్తాయి అయితే తేజస్ మార్క్ 2 లో కూడా జెనెరల్ ఎలెక్ట్రిక్ 414 ఇంజిన్ ని అమర్చబోతున్నది. జెనెరల్ ఎలెక్ట్రిక్ 414 ఇంజిన్ అనేది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫీచర్స్ కలిగి ఉంది. ఇంజిన్ ఫైల్యూర్ అనేది ఉండదు. ఇక ఏవియనిక్స్ విషయానికి వస్తే ప్రస్తుతం భారత్ రష్యా కంటే ముందు ఉంది.
9. రష్యా భయం ఏమిటంటే Tejas Mark -1A, Tejas Mark -2 లు తన పాత ఖాతాదారులని ఇప్పటికే ఆకర్షించాయి. Tejas Mark 2 2022 లో మొదటి ప్రోటో టైపు బయటికి వస్తుంది అలాగే సీరీస్ గా ప్రొడక్షన్ 2025-26 లలో మొదలవుతుంది. వియత్నాం,మలేషియా, ఇండోనేషియా లాంటి ఆసియా దేశాలు ఇప్పటికే Tejas కొనడానికి ఆసక్తి తో ఉన్నాయి కనుకనే భారత్ ఆయా దేశాలలో లాజిస్టిక్ ఫేసీలిటీస్ ఇప్పటికే స్థాపించినది.
10. రష్యా భయపడుతున్నది అనడానికి కారణాలు ఉన్నాయి అవేమిటో చూద్దాం :1. చెక్ మేట్ కొంటె ఏ దేశానికి అయినా సోర్స్ కోడ్ [Source Code ] ఇస్తామని ఎలా కావాలంటే అలా మార్చుకొని వేరే దేశానికి చెందిన వాటిని చెక్ మేట్ లో చేర్చుకొని స్వేచ్ఛగా వాడుకోవచ్చు. 2. ఇక ఇంజిన్ స్పెసిఫికేషన్ ఏమిటో బయటికి చెప్పట్లేదు అంటే రష్యాకి తన ఇంజిన్ మీద నమ్మకం లేదన్నమాట. 5 th జెనెరేషన్ అని చెప్పుకుంటూ ఎలాంటి ఏవియనిక్స్ ఉన్నాయో చెప్పకుండా, ఇంజిన్ స్పెక్స్ ఏమిటో చెప్పకుండా ప్రదర్శనలో పెట్టడం మీద అనుమానంతో కూడిన భయాలు ఉన్నాయని తెలిసిపోతున్నది. అసలు పూర్తి వివరాలు చెప్పకుండా కొంతమందికి డబ్బులు ఇచ్చి ఊదరగొట్టే ప్రచారం చేయించడం దేనికి సంకేతం ? F-35 కి దరి దాపులలోకి కూడా రాని దాన్ని పోటీలో ఉన్నట్లు ప్రచారం చేయడం వెనుక TEJAS MARK-2 మార్కెట్ ని తాత్కాలికంగా ఆపె కుట్ర తప్పితే వేరేది ఏదీ కాదు. 3. అసలు ఏ దేశం కూడా సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఇష్టపడదు అలాంటిది ఇంకా పూర్తిగా రూపు దిద్దుకొని అదీ కొత్త ప్లాట్ ఫామ్ మీద నిర్మిస్తున్న జెట్ ఫైటర్ కి సోర్స్ కోడ్ ఆఫర్ ఎందుకిస్తున్నట్లు ? తన పాత ఖాతాదారులని ఏమార్చడానికే కాదా ?
రష్యా ఎంత ప్రయత్నించినా భారత్ ని ఆపలేదు ఎందుకంటే 2001 లో మొదటి సారిగా గాల్లోకి ఎగిరినప్పటి నుండి ఇప్పటి వరకు 450 ఫ్లయింగ్ అవర్స్ పూర్తి చేసింది ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇది ప్రపంచ రికార్డ్ ఇప్పటివరకు. ఇంజిన్ ప్రాబ్లెం కానీ మరే ఇతర ప్రాబ్లం కానీ లేకుండా 450 గంటల ఫ్లయింగ్ అవర్స్ పూర్తి చేసిన జెట్ ఫైటర్ తేజస్ మాత్రమే.
So! రష్యా ఎంతమాత్రమూ మనకి మిత్ర దేశం కాబోదు! కేవలం వ్యాపార దృక్పధం తోనే సంబంధమ్ ఉంది తప్పితే తన ప్రయోజనాలని పక్కన పెట్టి సహాయం చేయదు వీలుంటే మన మార్కెట్ ని కొల్లగొట్టడానికే చూస్తుంది అని చెక్ మేట్ ఉదంతం చెప్పకనే చెప్తున్నది. ఈ విషయం మన అధికారుల దృష్టికి రాలేదు అని అనను కానీ వివరాలు అందరికీ తెలియాలి అనేదే ఈ పోస్ట్ ఉద్దేశ్యం.
జైహింద్ !