రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్ నిరోధక వాక్సిన్ స్పుత్నిక్ -వి త్వరలోనే భారత్ రానుంది. పదిరోజుల్లో స్పుత్నిక్ టీకా ఉత్పత్తి దేశంలో ప్రారంభం అవుతుందని , ప్రతినెలా 5 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి జరుగుతుందని…
రష్యాలో భారత రాయబారి బాలవెంకట్ శర్మ తెలిపారు
రష్యా స్పుత్నిక్ -వి టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ DCGI కొద్ది రోజుల క్రితమే అనుమతిచ్చింది. రష్యానుంచి దిగుమతికి మార్గం సుగమం అయిందని… ఇక్కడ స్పుత్నిక్ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది.
రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ RDIF సహకారంతో గమలేయా ఇన్ స్టిట్యూట్ స్పుత్నిక్ వాక్సిన్ ను తయారు చేసింది. ఈ టీకాను భారత్ లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు గత సెప్టెంబర్లోనే రెడ్డీస్ సంస్థతో ఒప్పందం కుదిరింది. రెండు మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఫలితాలు పరిశీలించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు… భారత్ లో స్పుత్నిక్ -వి టీకాల ఉత్పత్తి, వినియోగానికి ఆమోదం తెలిపింది డీసీజీఐ.