ఉత్తర తెలంగాణ లో చాలా చోట్ల వరదలు ముంచెత్తాయి. కామారెడ్డి వంటి చోట్ల వరద ఊరంతటినీ ముంచి వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో బయటకు వచ్చేసి, ప్రాణాలు దక్కించుకొన్నారు. సర్వం కోల్పోయిన బీద ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి.
…..
ఇటువంటి ఆపద కాలంలో ఆర్ ఎస్ ఎస్.. స్వయం సేవకులు రంగంలోకి దిగారు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వరదల్లో చిక్కుకున్న అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినారు. మరియుఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సహకరించి వరదల్లో చిక్కుకున్న వెయ్యి మందికి పైగా ప్రజలను ముంపు నుంచి కాపాడినారు.
……..
మొదటి రోజు కామారెడ్డి పట్టణ కేంద్రం నుంచి మొదలుకుని భిక్కనూరు వరకు 44వ జాతీయ రహదారిపై వరదలు ఉధృతంగా ప్రవహించడంతో బుధవారం రోజంతా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లి, బస్వాపూర్ వద్ద జాతీయ రహదారిపై వరదలో చిక్కుకున్న పలువురు వాహనదారులకు స్వయం సేవకులు.. . 700 మందికి పులిహోర, అరటి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు సురక్షిత త్రాగు నీరు అందించినారు.
……..
మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామంలో ముంపుకు గురై, పాఠశాలలో ఉంటున్న వారికి సేవ భారతి ఆధ్వర్యంలో అత్యవసర మందులు మరియు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు. రాజంపేట మండలం నడిమి తండా, లేత మామిడి తండా వాసులు .. ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు. అంతటి మారు మూల ప్రాంతాలలో కూడా… ఆహారపు ప్యాకెట్లు తయారు చేసి, పంపిణీ చేశారు. ఇలా నాలుగు రోజుల పాటు పూర్తిగా ఆహారం అందిస్తూ, సేవలో నిమగ్నమయ్యారు.అలాగే నిత్యావసర వస్తువులైన బియ్యం, మక్కపిండి, పప్పులు, ఉప్పు కారం, నూనె, ప్లేట్లు, బగోన్లు, బకిట్లు గ్లాసులు బట్టలు, రగ్గులు కూడా అందజేశారు.
………
కామారెడ్డి నగరంలో బతుకమ్మ కుంటలో 170 మందికి, అంబేద్కర్ నగర్ లో 70 మందికి, అయ్యప్ప కాలనిలో 100 మందికి,జీ ఆర్ కాలనీలో 150 మందికి జాతీయ రహదారుల వెంట 700 మందికి బస్టాండులో 160 మందికి మొత్తం 1350 మందికి సమాజ సహకారం తో స్వయం సేవకులు ఆహారం, నీరు అందించి, వారి ఆకలిని తీర్చారు. మూడవ రోజు బతుకమ్మ కుంట, డ్రైవర్స్ కాలనీ లలో 40 మందికి ఆహారం అందజేశారు. అలాగే లింగంపేట్ మండలం లోని కోమట్ పల్లిలో 200 మందికి ఆహారం అందించారు.
….
ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవకులు, సేవా భారతి కార్యకర్తలు, వివిధ క్షేత్రాల కార్యకర్తలు సమన్వయంతో సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇబ్బందిపడుతున్న నిరాశ్రయులను సహాయ సహకారాలు అందిస్తామని ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు పేర్కొన్నారు. ఆర్ ఎస్ ఎస్ ఇంత పనిని నిశ్శబ్దంగా నిర్వహిస్తుంటే,, కుహానా పక్షులు మాత్రం సోషల్ మీడియాలో కబుర్లు చెబుతూ,, కాలక్షేపం చేస్తూ కనిపిస్తున్నారు.