మహా కుంభమేళా లో పర్యావరణ పరిరక్షణ కోసం సంఘ్ ఉద్యమం
…
కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న అద్భుతఘట్టం కుంభమేళా. ఈ కుంభ మేళా లో పరిశుభ్రత కీలకమైన అంశంగా నిలుస్తుంది. దీనిని ద్రష్టిలో ఉంచుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుగానే ప్రణాళిక రచించింది. పర్యావరణ పరిరక్షణ కోసం కుంభమేళా ప్రారంభం మునుపే ఓ కీలక ఉద్యమం చేపట్టింది. పర్యావరణానికి ముప్పువాటిల్లకుండా ‘‘ఏక్ థాలీ, ఏక్ థైలా’’అన్న ఉద్యమాన్ని చేపట్టింది. అంటే ఒక బట్ట సంచి, ఒక కంచం అన్న మాట. మహా కుంభమేళాలో భోజనాలు చేయడానికి ఎవరైనా ప్లేట్ అడిగితే… ప్లాస్టిక్ విస్తర్లు కాకుండా.. సమాజం నుంచి సేకరించిన స్టీల్ ప్లేటును ఇస్తున్నారు.
అలాగే వస్తువుల కోసం బట్ట సంచీ ఇస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ వాడకం చాలా వరకు తగ్గింది.
..
‘‘ఏక్ థాలీ, ఏక్ థైలా’’ అన్న ఉద్యమం ద్వారా 140 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. అలాగే 29,000 టన్నులకు పైగా వ్యర్థాలు తగ్గాయి. ఈ చొరవతో 29,000 టన్నుల వ్యర్థాలు తగ్గిపోయాయి. ఈ ఉద్యమంలో 2,241 సంస్థలు పాల్గొనగా, 7,258 కలెక్షన్ సెంటర్లున్నాయి. ఈ ఉద్యమంలో 14,17,064 స్టీల్ కంచాలు, 13,46,128 బట్ట సంచులు, 2,63,678 స్టీల్ గ్లాసులు అందుబాటులో వుంచారు. 43 రాష్ట్రాల నుంచి సేకరించారు.
..
ఈ విషయం మీద సంఘ్.. దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో లక్షలాది హిందూ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. స్టీల్ ప్లేట్లు, బట్ట సంచులను ఇచ్చారు. దేశం నలుమూలల నుంచీ స్టీల్ ప్లేట్లు, బట్ట సంచులు వాహనాల్లో కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో డిస్పోజబుల్ ప్లేట్లు , గ్లాసులు, గిన్నెల వినియోగం బాగా తగ్గిపోయింది. ఈ ఉద్యమంతో 3.5 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఎందుకంటే రవాణా, ఇంధనం, శుభ్రపరచడం, సిబ్బంది ఖర్చులు తగ్గిపోయాయి. లేదంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్ చెత్త కొనడం, ఏరడం, సిబ్బంది కేటాయింపుతో డబ్బులు ఖర్చయ్యే అవకాశాలుండేవి.
..
మొత్తం మీద ఆర్ ఎస్ ఎస్ చేపట్టిన అద్బుతమైన ప్రణాళిక కు ఇప్పుడు అన్ని వైపుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం, సమాజ హితం కోసం నిర్వహిస్తున్న అద్భుతమైన సేవను అంతా అభినందిస్తున్నారు.