బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడుల విషయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తున్న ఇస్కాన్ గురువు చిన్మోయి కృష్ణదాస్ ను విడుదల చేయాలని ఆర్ఎస్ఎస్ విన్నవించింది.
ఈ మేరకు ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సర్ కార్యవాహ) దత్తాత్రేయ హోసబెళ ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా బంగ్లాదేశ్ లో హిందువులు ఇతర మైనారిటీల మీద ఇస్లామిక్ అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నాయని ఆర్ఎస్ఎస్ గుర్తు చేసింది. ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. దీని మీద ప్రజాస్వామ్య యుతంగా గళం ఎత్తిన ఇస్కాన్ వంటి సంస్థలను వేధించడం సరికాదని స్పష్టం చేసింది. దాడులకు గురవుతున్న మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవడం లేదని అభిప్రాయపడింది. సరి కదా,, ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తున్న చిన్మోయి కృష్ణ దాసును అన్యాయంగా అరెస్టు చేశారని స్పష్టం చేసింది. ఈ అరెస్టును ప్రజాస్వామ్య వాదులు అంతా ఖండించాలని,,, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ఈ విషయంలో బంగ్లాదేశ్ లోని హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ సమాజం అండగా నిలవాలని ఆర్ఎస్ఎస్ సూచించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సంఘం అభిప్రాయ పడింది.