విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది “ది కేరళ స్టోరీ”. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ముఖ్యంగా కేరళలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుపార్టీలు స్పందించగా…తాజాగా సీఎం పినరయి విజయన్ స్పందించారు. కేరళను తీవ్రవాద రాష్ట్రంగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని.. ఆ కుట్ర వెనక ఉన్నది ఎవరో కాదు ఆర్ఎస్ఎస్ అంటూ మండిపడ్డారు.
మరి “ది కేరళ స్టోరీ” ఇంత వివాదాస్పదం అవుతుండడానికి కారణమేంటి..సినిమాలో ఏముందో ఓ సారి చూద్దాం. ప్రేమ పేరుతో యువతులకు వల వేసి బలవంతంగా మతం మార్చి ఉగ్రవాద సంస్థల్లోకి బలవంతంగా రిక్రూట్ చేస్తున్న వాస్తవ పరిస్థితులు ఆధారంగా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుదీప్తోసేన్. నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా. ఓ నలుగురు యువతులు మతంమారి తరువాత ఐసిస్ లో చేరిన నేపథ్యంతో స్టోరీ సాగుతుంది. అయితే అదృశ్యమైన యువతులు మతం మారి, ఉగ్రసంస్థల్లో చేరి అక్కడ శిక్షణ పొంది…ప్రపంచవ్యాప్తంగా ఉగ్రకార్యకలాపాల్లో పనిచేస్తున్నారని అందులో చూపించారు.
ఇటీవలే సినిమా ట్రైలర్ రిలీజైంది. దీంతో సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ అధికార పార్టీతో పాటు విపక్ష కాంగ్రెస్ సైతం మండిపడుతోంది. మతాల మధ్య చీలిక తెచ్చేందుకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్స్ కాదంటూ మండిపడుతున్నాయి. అంతర్జాతీయంగా కేరళ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తుంటే చిత్రంగా క్టిస్టియన్ అసోసియేషన్ వంటి సంఘాలు మాత్రం చిత్రానికి మద్దతు తెలపడం విశేష. లవ్ జిహాద్ బాధితుల్లో, వరుసగా అదృశ్యమవుతున్న యువతుల్లో క్రైస్తవ అమ్మాయిలూ ఉండడం ఇందుకు కారణం. లవ్ జిహాద్ బారిన పడి కేరళలోని ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయని అక్కడి క్రైస్తవసంఘాలు అంటున్నాయి.
సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఆదాశర్మ సైతం వివాదంపై స్పందించారు. సినిమా విడుదలను అడ్డుకుంటూ కొందరు చేస్తున్న ప్రకటనలు విచిత్రంగా ఉన్నాయని ఆమె అన్నారు. అసలు అమ్మాయిలు కనిపించకుండా పోవడమే బాధాకరం అని.. వారంతా ఏమయ్యారో తెలుసుకోకుండా…అంతమంది పోలేదు అనడం విచిత్రంగా ఉందన్నారు. సినిమాలో ట్రైలర్ లో చూపించిన కౌంట్ గురించి మాట్లాడుతున్నారని… అంటే ఎంతోకొంతమంది పోయినట్టే కదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. తాను స్వయంగా ఎందరో బాధితులను కలిశానిని ఆమె చెబుతున్నారు. వారినుంచి వివరాలు సేకరించిన తరువాతే వాటి ఆధారంగానే సినిమా తీశామంటున్నారు. సినిమా చూస్తే ఎవరూ తాము చెప్పిన నెంబర్ ప్రస్తావించరంటున్నారు.
“ది కేరళ స్టోరీ” ఏప్రిల్ 26న ట్రైలర్ రిలీజైంది. సెన్సార్ బోర్డ్ అనుమతి కూడా రావడంతో మే 5న సినిమా విడుదల చేస్తున్నారు.
CM Pinarayi Vijayan says film 'The Kerala Story' aims to spread hate propaganda against state
Read @ANI Story | https://t.co/PLsglzQKnR#PinarayiVijayan #TheKeralaStory #adahsharma #kerala #conversioncase #Iraq #Syria #32000girlsmissing pic.twitter.com/h6JfdsjDWn
— ANI Digital (@ani_digital) April 30, 2023