తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం వ్యవహార శైలికి నిరసనగా ఆర్ఎస్ఎస్ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. సంఘ్ స్థాపించిన విజయదశమి రోజున ప్రతి పట్టణం, నగరం లలో పథసంచలన చేయడం ఆనవాయితీ. ప్రతి రాష్ట్రంలోనూ ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం పరిపాటి. అలాగే మద్రాస్ నగరంలో పథ సంచలనం కోసం గత ప్రభుత్వాలు కూడా అనుమతి ఇస్తూ ఉండేవి.
కానీ ఈసారి డీఎంకే ప్రభుత్వము అనుమతిని నిరాకరించింది. సంఘ్ స్థాపన విజయ దశమి రోజే జరిగింది కాబట్టి, పథ సంచలన్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దసరా నాటికి 100 సంవత్సరంలోకి సంఘ్ అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో తమ పథ సంచలన్కి అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను ఆదేశించాలని కోరుతూ ఆర్.ఎస్.ఎస్. కోర్టుకెక్కింది.
అన్ని వివరాలతో ఒక పిటీషన్ను సంఘ్ పెద్దలు మద్రాస్ హైకోర్టుకి సమర్పించారు.
గతంలో హైకోర్టు సూచించిన మార్గదర్శకాల ప్రకారమే కార్యక్రమం ఉంటుందని పిటీషనర్లు వాదించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము దరఖాస్తులు సమర్పించినా, పోలీసులు అనుమతి ఇవ్వలేదని పిటిషనర్ కోర్టు ముందు వాదించారు. ఈ కార్యక్రమం కోసం అన్ని సన్నాహాలు తాము చేసుకున్నామని, అనుమతి సకాలంలో ఇవ్వాలని కోర్టును కోరారు. అక్టోబర్ 6వ తేదీన ఆర్.ఎస్.ఎస్. పథ సంచలన్ నిర్వహించనుంది. చెన్నైలోని 58 ప్రాంతాల గుండా ఈ పథ సంచలన్ సాగుతుంది.
డీఎంకే ప్రభుత్వ వ్యవహార శైలి మీద సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది. పథ సంచలన్కి అనుమతి మంజూరుపై ఆలస్యం కావడంపై స్థానిక హిందూ నేతలు ఆక్షేపిస్తున్నారు. ఫాసిస్టు డీఎంకే సర్కార్ కావాలనే ఇలా చేస్తోందని మండిపడ్డారు. ఇది సరైన విధానం కాదు అని అన్ని వర్గాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు పథ సంచలన్ మీద ఉత్కంఠ వీడనుంది.