RSS వంద సంవత్సరాల వేడుకలకు రంగం సిద్ధమైంది. న్యూఢిల్లీ వేదికగా శతజయంతి వేడుకలను దశమి ఉత్సవం పేరుతో నిర్వహించారు. వాస్తవానికి దేశమంతటా విజయదశమి ఉత్సవాలు గడచిన పది రోజులుగా అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి.
……
డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన వేడుకలకు సంఘ మరియు బిజెపి పెద్దలు.. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా రూపొందించిన ఓ కొత్త 100 రూపాయల నాణెం, స్మారక తపాలా స్టాంపు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు.
“ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రయాణం అద్భుతం, అపూర్వం, ప్రేరణాత్మకం” అని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్బంగా పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు, దేశ నిర్మాణం కోసం నిస్వార్థ సేవా భావంతో ఆర్ఎస్ఎస్ పోషించిన పాత్ర వెలకట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక వైభవాన్ని కాపాడి, భవిష్యత్ తరాలకు సజీవంగా అందించడంలో సంఘం విశేషమైన పాత్ర పోషించిందని మోదీ స్పష్టం చేశారు. కోట్లాది స్వయంసేవకులు దేశం కోసం అంకితభావంతో పనిచేయడం జాతికి గర్వకారణమని ఆయన అన్నారు.
సంఘ్ సంప్రదాయానలని పాటిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర మంత్రులు ఈ వేడుకలలో ఆకర్షణ గా నిలిచారు.
More Photos: