ఎన్నికల ముంగిట ఉత్తరప్రదేశ్ లో గూండా రాజకీయాలు మొదలయ్యాయి. సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు నిరాకరించిన కన్నైజ్ జిల్లా పంచాయతీ మెంబక్ భూపేంద్రషాక్యాపై దుండుగులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేగింది. కనౌజ్ నగర పంచాయతీ సౌరిఖ్ లోని 18వ వార్డునుంచి ఎన్నికైన భూక్యాను పార్టీ మారాల్సిందిగా కోరారు స్థానిక ఎస్పీనాయకులు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. దీంతో తనను బెదిరించారని..హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ ఆయన పోలీసులను ఆశ్రయించారు.
పనిమీద చిబ్రామౌ వెళ్లి తిరిగి సౌరిఖ్ కు వస్తుండగా… సఖౌలిలో ఇషాన్ నది వంతెన దగ్గర నలుగురు నిందితులు తన కారును అడ్డగించారని… తాను ఆగకుండా ముందుకు సాగానని దీంతో కాల్పులు జరిపారని..కారుధ్వంసమై త్రుటిలో తాను ప్రాణాపాయం నుంచి బయపడ్డానని పోలీసులకు ఫిర్యాదు చేశారు భూపేంద్ర.
అంతకుముందు కనౌజ్ జిల్లా పంచాయతీ సభ్యుడే అయిన వివేక్‌కుమార్ శాక్యా, అన్నూ శర్మ, పరౌర్ గ్రామానికి చెందిన దిలీప్పాల్, ఖాన్పూర్కు చెందిన రాహుల్ యాదవ్ తనను పార్టీ మారాలని కోరారని అందుకు ఒప్పుకోకపోవడం వల్లే హత్యాయత్నం చేశారని ఆరోపించారు.
తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత కూడా వాళ్లు వదల్లేదని..ఏకంగా ఇంటికే వచ్చి కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించారని ..తన తండ్రిని చంపేస్తామిన బెదిరించారని పోలీసులతో పాటు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం నిజమేనని ప్రాథమిక విచారణలో తేలడం, ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేయడంతో భూపేంద్ర ఇంటిదగ్గర భద్రత పెంచారు పోలీసులు.