అయోధ్యలో నిర్మిస్తున్న భవ్యరామమందిర నిర్మాణం కోసం శ్రీలంక ప్రభుత్వం అత్యంత భక్తితో అక్కడి శిలలను పంపింది. శ్రీలంక హైకమిషనర్, ఆ దేశ కేబినెట్ మంత్రులు ఇద్దరు వాటిని తీసుకువచ్చి అయోధ్యలో సమర్పించారు. శ్రీలంకలో రావణుడు సీతను బందీగా ఉంచిన అశోకవాటిక నుంచి వాటిని తీసుకువచ్చారు. రామజన్మభూమితీర్థ క్షేత్ర ట్రస్టుకు వాటిని అందజేశారు. రామ్ లల్లా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆ బృందం పాల్గొంది.
శ్రీలంక హైకమిషనర్ మిలిందా మొరగోడా, ఆయన భార్య జెన్నిఫర్ మొరగోడతో కలిసి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ స్థలాన్ని సందర్శించినట్లు రామ్ మందిర్ ట్రస్ట్ ప్రధానకార్యదర్శి చంపత్ రాయ్ ట్వీట్ చేశారు. రాయబారులతో పాటు…శ్రీలంక మంత్రులు కూడా పూజలో పాల్గొన్నారని తెలిపారు.