బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్నాడు భారతీయ సంతతికి చెందిన రిషీ సునాక్. తొలిరౌండ్ లో రిషికి 88 ఓట్లు వచ్చాయి. పెన్నీ మోర్డాంట్(67 ఓట్లు), ట్రస్ లిజ్(50 ఓట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ నదిమ్ జహావి, మాజీ మంత్రి జెర్మీ హంట్ పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు. భారత సంతతి వాడే అయిన మరో ఎంపీ సుఎల్లా బ్రేవార్మన్ మాత్రం పోటీలో కొనసాగుతున్నారు. బోరిస్ వారసుడు ఎవరనేది సెప్టెంబర్ 5న తేలనుంది. కాగా ప్రధాని రేసులో నిలిచే అభ్యర్థులకు కనీసం 20మంది ఎంపీల మద్దతుండాలి. ప్రతీరౌండ్లోనూ కనీసం 30 ఓట్లు సాధించని అభ్యర్థులు పోటీనుంచి ఎలిమినేట్ అవుతారు. ఇలా చివరి వరకు రెండుస్థానాల్లో నిలిచిన వారిలోనుంచి ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు.
https://twitter.com/ANI/status/1547254931136331777?s=20&t=52QBgOp75ppRi7oRnGswNQ