బ్రిటన్ ప్రధాని పోటీదారు.. భారతీయ సంతతికి చెందిన నేత రిషి సునాక్ శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడానికి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించేందుకు అతని సతీమణి అక్షతా మూర్తితో కలిసి వచ్చారు. దీనికి సంబంధించిన వారి ఫొటోను రిషి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పండుగ సందర్భంగా తన భార్య అక్షితతో కలిసి తాను గుడికి వెళ్లినట్లు రిషి తెలిపారు.
బ్రిటన్ దేశ విదేశాంగ మంత్రి లిజ్ ట్రూస్, రిషి సునాక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. దీంతో రిషి సునాక్ ఎన్నికల్లో గెలుపొందుతారా లేదా అనే అంశం చర్చనీయాంశంగా ఉంది.