తెలంగాణ ప్రభుత్వం ఏడాది కాలంలోనే లక్షా పాతిక వేల కోట్ల పైన అప్పులు చేసిందన్న మాట .. కలకలం రేపుతోంది. ఎన్నికల హామీలు పెద్దగా అమలు చేసిందీ లేదు, ప్రజల జీవితాల్ని బాగు చేసిందీ లేదు కానీ,, అప్పులను అమాంతం పెంచేయటం మాత్రం దారుణం. ఒక్క ఏడాదికి లక్షా పాతిక అంటే అయిదేళ్లూ పూర్తయ్యే సరికి ఆరు లక్షల కోట్ల రూపాయలను అప్పులుగా రుద్దేయటం ఖాయం. ఇవన్నీ అంతిమంగా ప్రజల నెత్తినే పడటం కూడా అంతే ఖాయం. ఇవేమీ గాలిలో మాటలు కానే కాదు, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అందించిన అధికారిక లెక్కలు.
….
తెలంగాణ శాసనసభలో రాష్ట్రం అప్పుల మీద వాగ్వాదం చెలరేగింది. ప్రభుత్వం తరపున అప్పుల లెక్కలను డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసనసభకు సమర్పించారు. రాష్ట్రంలో FRBM పరిధిలో తీసుకున్న రుణాలెన్ని? దాని పరిధిలోకి రాకుండా తీసుకున్న రుణాలెన్నో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు .. శాసనసభ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి భట్టి సమాధానం ఇస్తూ, 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వ రుణాలు, ప్రభుత్వేర రంగాలకు ఇచ్చిన గ్యారెంటీల వివరాలు వెల్లడించారు. FRBM కింద తీసుకున్న రుణాలు యాబై రెండు కోట్లు అని వివరించారు. ఇక, కార్పొరేషన్లు, ఎస్పీవీలు డ్రా చేసిన ఇతర రుణాలు అరవై ఒక్క కోట్లు అని తెలిపారు. ఇక,, చిల్లర అప్పులు పదివేల కోట్ల దాకా ఉంటాయని లెక్క తేల్చారు
….
ఒక వైపు ఎన్నికల గ్యారంటీలను పెద్దగా అమలు చేయనేలేదు. ఈ లోగానే ఏడాది తిరగకుండా ఎడా పెడా అప్పులు చేసేశారు. ఈ డబ్బులంతా ఏమి చేస్తున్నారు అన్నదానికి స్పష్టమైన సమాధానం రావటం లేదు. అటు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు ఎడా పెడా అడ్వాన్సులు విడుదల అయిపోతున్నాయి. ఈ డబ్బులన్నీ ఎటు వెళుతున్నాయో వేరే చెప్పనక్కర లేదు. మరో వైపు, వచ్చే పంటల సీజన్ నాటికి రైతులను ఆదుకొనేందుకు కూడా ప్రణాళిక కనిపించటం లేదు. దీంతో గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెబితే మండి పడుతున్నారు. అందుచేతనే స్థానిక ఎన్నికలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
….
అసెంబ్లీలో అప్పుల పాపం మీద వాదనలు బాగా నడిచాయి. ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఇది తప్పంటూ ప్రస్తుత ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. తాము అప్పు చేసింది 52 కోట్లే అని, మిగిలిన దంతా వడ్డీ చెల్లింపులు అని చెప్పుకొచ్చారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, పెండింగ్ బిల్లులకు తాము చెల్లిస్తూ వచ్చామని భట్టి అంటున్నారు. మొత్తం మీద ఈ హెడింగ్ ల కింద ఖజానా నుంచి లక్ష కోట్లు వెళ్లిపోయాయి అన్నది నిజం.
..
నిజానికి ఈ పాపంలో ఎక్కువ భాగం బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పాలి. అప్పట్లో గులాబీ ప్రభుత్వం ఎడా పెడా అప్పులు చేసేసి ఇంటికి వెళ్లిపోయింది. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ను అప్పుల ప్రాంతంగా మార్చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత వేగంగా అప్పులు చేస్తూ, ప్రజల నెత్తిన అప్పులు రుద్దుతోంది. అంతిమంగా ఈ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రజలదే అనటంలో సందేహం లేదు. అప్పుల పాపం ఎవరిది అయినా, అదంతా తీర్చాల్సిన శాపం మాత్రం సామాన్యుల మీదనే పడుతోంది.