
అసెంబ్లీ మీడియాపాయింట్లో మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రేవంత్ వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమర్థిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ పై పీడీయాక్ట్ పెట్టాలన్నారు. డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. హాత్ సే బాత్ జోడోయాత్ర రెండో రోజు సందర్భంగా రేవంత్ ప్రగతిభవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేయాలన్నారు. పేదలకు ప్రవేశం లేని ప్రగతిభవన్ ఉంటే ఏంటి లేకుంటే ఏంటని మండిపడ్డారు. నాడు దొరల గడీలను పేల్చిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్ లేకుండా చేసినా అభ్యంతరం లేదన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు కేసులు పెడుతున్నారు.




