పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని హత్యచేసిన దుండగులు !
R.N. కులకర్ణి అనే 83 ఏళ్ల వయసుకల పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారిని కారుతో గుద్ది చంపిన హంతకులు. నవంబర్ 4 సాయంత్రం 5.30 కి నడక కోసం వచ్చిన కులకర్ణి గారికి యాక్సిడెంట్ అయ్యిందని కంప్లైంట్ వచ్చింది మైసూరు పోలీసులకి. ఘటన జరిగిన మానస గంగోత్రి అనే ప్రాంతానికి వెళ్ళి చూడగా తీవ్రంగా గాయపడి రోడ్డుకి పక్కగా ఉన్న గడ్డిలో పడి ఉన్న కులకర్ణి గారిని మైసూరు లోని హాస్పిటల్ లో చర్చగా వృద్ధాప్యం వలన తీవ్ర గాయాలని తట్టుకోలేక ఆయన మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు!
Mysuru: Fmr Intelligence Bureau (IB) officer R.N. Kulkarni (82) died after a speeding car hit him and sped away. He was on his routine evening walk in Manasagangothri campus. Police registered a hit-and-run case. As per the investigation, the case appears to be a planned murder. pic.twitter.com/InX9eofdy4
— Pinky Rajpurohit (ABP News) 🇮🇳 (@Madrassan_Pinky) November 6, 2022
ముందు పోలీసులతో సహా అందరూ ప్రమాదవశాత్తూ కారు లాంటిది ఏదో గుద్ది వెళ్ళిపోయి ఉంటుంది అనుకోని మొదట హిట్ అండ్ రన్ కేసుగా భావించారు. కానీ ఘటన జరిగిన మైసూరు లోని మానస గంగోత్రి ప్రాంతము లో ఉన్న CCTV ఫుటేజ్ లని పరిశీలించగా అది హత్యాగా గుర్తించారు.
సాయంత్రం నడక కోసం వచ్చిన కులకర్ణి గారు అంతగా జన సంచారం లేని మైసూరు యూనివర్సిటీ కాంపస్ లోని మానస గంగోత్రి కాలనీలో హత్యకి గురి అయ్యారు. నంబర్ ప్లేట్ లేని కారు ఒకటి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న కులకర్ణి గారి మీదకి కావాలనే వచ్చి గుద్దేశి వెళ్లిపోయినట్లు CCTV లో రికార్డ్ అయ్యింది. దాంతో పోలీసులు హిట్ అండ్ రన్ కేసుగా కాకుండా ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా కేసు ఫైల్ చేశారు.
మైసూరు లోని జయలక్ష్మి పోలీసు స్టేషన్ లో FIR ని లాడ్జ్ చేశారు పోలీసులు. మైసూరు పోలీస్ కమీషనర్ శ్రీ చంద్ర గుప్త గారు మాట్లాడుతూ మొదట హిట్ అండ్ రన్ కేసుగా భావించామని తరువాత CCTV ఫుటేజ్ చూశాక దానిని ప్రీ ప్లాన్డ్ మర్డర్ కేసుగా రిజిస్టర్ చేశామని తెలిపారు.
మానస గంగోత్రి నరసింహ రాజ పరిధిలోకి వస్తుంది కాబట్టి అసిస్టంట్ పోలీస్ కమీషనర్ నేతృత్వంలో మూడు టీమ్ లని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. కారు నంబర్ ప్లేట్ లేకుండా ఉండడం వలన కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నా ఇప్పటికే మా దర్యాప్తు బృందానికి కొన్ని లీడ్స్ దొరికాయని చెప్తూ వాటిని ఇప్పటికిప్పుడే బయటికి చెప్పలేమని మొత్తం కేసు దర్యాప్తు అయిపోయి హంతకులని పట్టుకున్నాక వివరంగా చెప్తామని పేర్కొన్నారు మైసూరు పోలీస్ కమీషనర్ చంద్రగుప్తా గారు.
83 ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని ఎవరు హత్య చేసి ఉంటారు ?
R. N. కులకర్ణి గారు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో లో పని చేసి 2000 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు.
తన రిటైర్మెంట్ తరువాత కులకర్ణి గారు మూడు పుస్తకాలు వ్రాసారు.
‘…and yet God smiles’ అనే పుస్తకం వ్రాసారు. ఈ పుస్తకం ఒక కుటుంబంలోని అయిదు తరాల వారి జీవన శైలి తో పాటు అలవాట్లు,పద్ధతులని ఆసక్తికరంగా వ్రాసారు. ఇది ఫిక్షన్ నవల.
Sin of National Conscience అనే రెండో పుస్తకంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్స్ మీద ఆసక్తి కలిగించే విధంగా నిజ అనుభవాలని ఉటంకిస్తూ వ్రాసారు. ఈ పుస్తకం చాలామంది ని ఆకర్షించింది మరియు చర్చలకి తెర తీసింది.
Facets of Terrorism in India అనేది మూడవ పుస్తకం వ్రాసారు. ఈ పుస్తకం సంచలన నిజాలని బయట పెట్టింది. భారత దేశంలో ఉగ్రవాదం తాలూకు బహు ముఖాలని బయట పెట్టింది. ముఖ్యంగా జిహాద్ మీద ఆయన వ్రాసిన కొన్ని సంఘటనలు మనల్ని విస్తుపోయేలా చేస్తాయి. ఈ పుస్తకం ప్రధానంగా రెండు విషయాల మీద చర్చిస్తుంది. ఒకటి రెడ్ కారిడార్ రెండవది జిహాద్. ప్రస్తుతం మన దేశం ఈ రెండు విషయాల మీద పోరాడాల్సి వస్తున్నది అంటూ వివరంగా వ్రాసుకొచ్చారు. రెడ్ కారిడార్ అంటే కమ్యూనిస్ట్ ప్రభావం కల మన వ్యవస్థ ఎలా మన దేశాన్ని నడుపుతున్నదీ వివరంగా తెలియచేసారు. రెండవది జిహాద్ ని ఎలా ఎవరు ఎక్కడ ప్రోమోట్ చేస్తున్నారో వివరంగా వ్రాసారు. పైన పేర్కొన్న రెండు పుస్తకాల కంటే ఈ పుస్తకం మరింత ఆసక్తితో పాటు చర్చలకి తెర లేపింది. వ్రాసింది ఒక మాజీ కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాబట్టి కొన్ని నిజ సంఘటనలని వ్రాసారు కాబట్టి ఈ పుస్తకం మీద చర్చ జరిగింది.
Facets of Terrorism in India అనే పుస్తకం 1000 ఏళ్ల దురాక్రమణ దారుల నిజ చరిత్రని ప్రస్తావించారు కులకర్ణి. చరిత్ర కారులు మన పూర్వ చరిత్రని ఏ సందర్భంలో ఎలా వక్రీకరించి వ్రాసారో ఆధారాలతో సహా వివరించారు తన పుస్తకంలో.
83 ఏళ్ల వయో వృద్ధిడిని RN కులకర్ణి ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ?
జిహాద్ మీద పుస్తకం వ్రాసినందుకా ? లేక ఆస్తుల విషయంలో హత్య జరిగిందా ?
అయితే పోలీసులు ఆస్తి వివాదంలో హత్య జరిగి ఉండవచ్చు అని చూచాయగా చెప్తున్నారు. కానీ అసలు హంతకులని తప్పు దోవ పట్టించడానికి కులకర్ణి హత్య ని ఆస్తి తగాదా హత్యాగా ప్రకటించి ఉండవచ్చు. దీని వల్ల హంతకులు నిర్భయంగా ఉంటారు దొరికిపోతారు అనే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చు !
ఏదయినా సరే నిత్యం ప్రశాంతంగా ఉండే మైసూరు లాంటి నగరంలో ఒక మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హత్య జరగడం విచారకం! పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా ఉండే మైసూరు నగరంలో ప్రశాంతంగా జీవితం గడపాలి అని అనుకునేవారిలో ఉత్తరాది విశ్రాంత ఆఫీసర్లు కూడా ఉన్నారు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. – పార్ధసారధి పోట్లూరి