భారత గణతంత్రం… ఘనమైన రాజ్యాంగం
ఛెబ్బీస్ జనవరి. అంటే 1950 జనవరి 26న భారత్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి గణతంత్ర దేశంగా మారింది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. ఇది దాదాపుగా అందరికీ తెలుసు. ఎక్కువ మందికి తెలియని కొన్ని విశేషాలను ఈ 72వ రిపబ్లిక్ డే సందర్భంగా తెలుసుకుందాం.
డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్ స్టిట్యూషన్ అంటారు. అంటే మన రాజ్యాంగ పిత.
అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, దాదాపు మూడేళ్లపాటు ఈ రాజ్యాంగాన్ని రాశారు. ఎక్కువగా బ్రిటిష్ రాజ్యాంగ ప్రభావమే కనిపిస్తుంది.
ఒక విశేషం ఏమిటంటే మన రాజ్యాంగ పీఠిక లేదా ప్రీ యాంబుల్ కు స్ఫూర్తి అమెరికా రాజ్యాంగం. వి, ద పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనే ప్రీయాంబుల్ ను స్ఫూర్తిగా తీసుకుని “వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సాలెమన్ లీ రిసాల్వ్ డ్ టు కాన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండి….” రాశారు.
మన రాజ్యాంగాన్ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని కూడా అంటారు. అంటే ఇతర దేశాల్లోని రాజ్యాంగాల నుంచి మనం అనేక అంశాలను అరువు తెచ్చుకున్నాం.
ఎక్కువగా బ్రిగిష్ రాజ్యాంగంలోని అంశాలను తీసుకున్నాం.
స్వేచ్ఛ, సమానత్వం వంటి విషయాల్లో ఫ్రాన్స్ రాజ్యాంగంలోని అంశాలనుల అరువు తీసుకున్నాం.
పంచవర్ష ప్రణాళిక అనే దానికి స్ఫూర్తి సోవియట్ యూనియన్ రాజ్యాంగం.
సుప్రీంకోర్టు పరిధి, ఇతర న్యాయ సంబంధమైన అంశాలకు స్ఫూర్తి జపాన్ రాజ్యాంగం.
ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలకు స్ఫూర్తి జర్మనీ వీమర్ రాజ్యాంగం.
వాస్తవంగా మొదటి రాజ్యాంగ ప్రతిని టైప్ చేయలేదు. చేతితో రాశారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్ జాదా హిందీ, ఆంగ్లంలోచేతితో ఇటాలిక్ ఫాంట్ లోరాశారు.
ఇలా డెహ్రాడూన్ లో మొదట రూపొందించిన రాజ్యాంగ ప్రతికి సర్వే ఆఫ్ ఇండియా ఫొటో లిథోగ్రాఫీ ద్వారా మెరుగులు అద్దింది.
ప్రతి పేజీని శాంతినికేతన్ కళాకారులు అందంగా తీర్చిదిద్దారు.
మన రాజ్యాంగ ఇంగ్లీష్ వెర్షన్ లో మొత్తం లక్షా 17 వేల 369 పదాలున్నాయి.
భారత రాజ్యాంగ ఒరిజినల్ హిందీ, ఇంగ్లీష్ రాత ప్రతులను పార్లమెంటు లైబ్రరీలో ప్రత్యేకంగా హీలియం నింపిన కేసుల్లో భద్రపరిచారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఏడాదికే, అంటే 1951 మే 10న అప్పటి నెహ్రూ ప్రభుత్వం తొలి సవరణలు చేసింది.
ఇప్పటి వరకు భారత రాజ్యాంగానికి 104 సవరణలు జరిగాయి.
2020 జనవరి 25న 104వ సవరణ చేశారు.