ఆధునిక కాలంలో గూగుల్ మ్యాప్,, లొకేషన్ సిస్టం లను అందరూ వాడుకుంటున్నారు. కొత్త పట్టణం లేదా నగరంలో ప్రవేశించినప్పుడు గమ్యస్థానానికి చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ బాగా ఉపయోగపడుతోంది. గూగుల్ మ్యాప్ ను సెట్ చేసుకుంటే హాయిగా సొంత వాహనాల్లోనే ఎంత దూరమైనా ప్రయాణం చేసి రావచ్చు. ఈ గూగుల్ మ్యాప్ లో వినిపించే శ్రావ్యమైన గొంతు ఎవరిదో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.
గూగుల్ మ్యాప్ లో గమ్యస్థానం లేదా ప్రయాణం వివరాలు తెలియజేసే గొంతు ఆస్ట్రేలియా కు చెందిన కరెన్ జాకబ్ సేన్ ది. ఆమె వ్యక్తిగతంగా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. అంతేకాకుండా మంచి రచయిత మరియు మోటివేషనల్ స్పీకర్. యువతను కదిలించేలా ప్రసంగాలు చేయడంలో ఆమె దిట్ట. వాయిస్, పియానో సబ్జెక్టుల మీద ఆమె డిగ్రీ పూర్తి చేశారు తర్వాత కాలంలో గాత్రం ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు చేశారు.
మెరుగైన అవకాశాల కోసం అమెరికా చేరుకుని న్యూయార్క్ లో స్థిరపడ్డారు. అక్కడ కర్లీ క్వీన్స్ అనే పేరుతో కొన్ని ఆల్బమ్ లు విడుదల చేశారు. ఆ సందర్భంగా ఒక ఐటీ కంపెనీ ముందుకు వచ్చి టెలిఫోన్ డైరెక్టరీ సమాచారాన్ని వాయిస్ రూపంలో చేయాలని ప్రాజెక్టు ఇచ్చారు. చక్కటి ఉచ్చారణతో జాకబ్ సెన్ దానిని పూర్తి చేశారు. దీంతో ప్రపంచంలోనే అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని రికార్డు చేసే ప్రాజెక్టు ఆమెకు దక్కింది. గూగుల్ మ్యాప్ లొకేషన్స్ కు సంబంధించిన ప్రాజెక్టులో ఆమె వాయిస్ రావడంతో పేరు మారుమోగిపోయింది. యాండ్రాయిడ్ ఫోన్ లతో పాటుగా యాపిల్ ఫోన్ లలో వాడే సిరి వాయిస్ యాప్ లో కూడా ఆమె గొంతును అనుసంధానం చేశారు. ఇప్పుడు ఆమె ప్రపంచ స్థాయి సెలబ్రిటీగా మారిపోయారు.
మొత్తం మీద జిపిఎస్ తో మనల్ని నడిపిస్తున్న మార్గదర్శ పేరు కరెన్ జాకబ్ సేన్ అన్నమాట.