హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటం లేకపోవడంపై చర్చ జరుగుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో నెహ్రూ చిత్రపటంలేదు. బదులుగా మ్యూజియం గోడపై స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్ తోపాటు గాంధీ, అష్ఫాఖుల్లా ఖాన్, కన్హు ముర్ము వంటి వారి చిత్రపటాలను అలంకరించారు.
ఆసక్తికరంగా 1963 జూలై 23న సాలార్ జంగ్ మ్యూజియంను ప్రజల కోసం ప్రారంభించిన భారతదేశపు మొదటి ప్రధానమంత్రి నెహ్రూ. అయితే స్వాతంత్య్ర ఉద్యమంలో అన్ సంగ్ హీరోల సహకారాన్ని హైలైట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యూజియం అథారిటీ తెలియజేసింది.
జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాన్ని తొలగించడానికి నిర్దిష్ట కారణం లేదు. మేం విస్తృతంగా తెలిసిన కార్యకర్తలపై దృష్టి పెట్టడం కంటే స్వాతంత్య్ర పోరాటంలో అన్ సంగ్ హీరోలను హైలైట్ చేయాలనుకుంటున్నామని.. జవహర్లాల్ నెహ్రూ ఈ వ్యక్తుల కంటే చాలా ప్రసిద్ధి చెందారు.. మిగతా వారికి ఎక్కువ ప్రచారం అవసరం అనిపించిందని మ్యూజియం అధికారి తెలిపారు.
అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. పోర్ట్ బ్లెయిర్లోని సెల్యులార్ జైలులో ఎక్కువ సంవత్సరాలు గడిపిన వీర సావర్కర్ స్వాతంత్య్ర ఉద్యమానికి ఎటువంటి సహకారం అందించలేదని వారు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని.. వీర సావర్కర్ చిత్రపటాన్ని తొలగించాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఈ పరిణామాన్ని మాణికం ఠాగూర్ కూడా ధృవీకరించారు.
https://twitter.com/manickamtagore/status/1530472107247046656?s=20&t=rF6eTrHatA1VnTfxwpdMiA
కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కూడా నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని మార్చడంపై కేంద్రం ‘కుట్ర’ పన్నినట్లు సూచనప్రాయంగా పేర్కొన్నారు.
“చరిత్రను, ముఖ్యంగా స్వాతంత్య్ర ఉద్యమ వీరులను మార్చడం ద్వారా మీరు రాబోయే తరాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. మే 27న పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి రోజున దీన్ని నిర్వహించడం వెనుక కారణం ఏంటి. ఇది భారతదేశ మొదటి ప్రధానమంత్రికి జరిగిన ఘోర అవమానం” అని అన్నారు.
నిరసనల నేపథ్యంలో మ్యూజియం అధికారులు నెహ్రూ చిత్రపటాన్ని మళ్ళీ తిరిగి అమర్చారు. దీంతో కాంగ్రెస్ యూత్ లీడర్లు విజయం సాధించారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
https://twitter.com/INCTelangana/status/1530887496690610177?s=20&t=AnHCdK8yNyhhk_Ow1PMCvw
https://twitter.com/manickamtagore/status/1530887228070965248?s=20&t=fhWjKcUm6WhDARTj6m9sDw