నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు మద్దతు మరింత పెరుగుతోంది. న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియకోసం పిటిషన్ మొదలైన 12 గంటల్లోపు 10 వేల సైన్స్ వచ్చాయి ఆమెకు మద్దతుగా. వారిపై చర్యలకుడిమాండ్ చేస్తూ పార్లమెంట్ సభ్యులను అభ్యర్థిస్తూ సిద్ధం చేసిన పిటిషన్లో ఇలా ఉంది.
“01.07.2022న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అసలు వాస్తవం పక్కనపెట్టారు. నూపుర్ బెదిరింపులు, అత్యాచారం, హత్య హెచ్చరికల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు తిరిగి నూపుర్ నే తప్పుబట్టారు. ఉదయ్ పూర్ కన్నయ్య హత్యకు కారణం నూపురేనంటూమండిపడ్డారు. దేశంమొత్తం నిప్పుపెట్టడానికి కారణమైన ఉదయ్ పూర్ హత్యకు ఆమెదే బాధ్యత అని వాళ్లు వ్యాఖ్యానించడాన్ని మేం ఖండిస్తున్నాం’ అని ఉంది.
“ఇటువంటి దిగ్భ్రాంతికరమైన ప్రకటనలను రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు… భారత వ్యతిరేక శక్తులు జాతీయ,అంతర్జాతీయ మీడియా తమకు అనుకూలంగా మలుచుకుంటుంది. హిందువులను, దేశాన్నితక్కువ చేసి చూపిస్తూ ప్రచారం చేస్తాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు.రాజ్యాంగ విరుద్ధంగా వారి తీరు ఉంది. దేశం యొక్క విలువలు, ధర్మాలకు వ్యతిరేకంగా వారు చేసిన విరుద్ధమైన ప్రకటన ఇది” అని పిటిషన్ లో ఉంది.
జస్టిస్ జెబీ పార్దీవాలా, జస్టిస్ సూర్యకాంత్ పై అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశిస్తూ ఈ పిటిషన్ ను నేను ప్రారంభిస్తున్నానని నెటిజన్ వికాస్ పాండే జూలై 5న మొదలుపెట్టారు.
Change.orgలో రూపొందించిన పిటిషన్ లింక్‌ను పంచుకుంటూ ఒక ట్వీట్లో వికాస్ ఇలా అన్నాడు, “నేను ఎంపీలకు ఇవ్వాల్సిన పిటిషన్‌ను ఇప్పుడే చేసాను. ఇది జస్టిస్ సూర్యకాంత్ & జస్టిస్ జెబి పార్దివాలాపై అభిశంసన ప్రక్రియల దీక్ష కోసం – పిటిషన్‌పై సంతకం చేయండి!
తాను పిటిషన్ ను ఎంపీలకు ఫార్వార్డ్ చేస్తానని వికాస్ తెలిపారు. ఇటీవలి పరిణామాలు చాలా ఆందోళన కరంగా ఉన్నాయని వాపోయారు.ముఖ్యంగా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తుల వ్యాఖ్యలపై అభ్యంతరాలున్నాయన్నారు.తనపై నమోదైన కేసులన్నింటిని ఢిల్లీకి బదిలీ చేయాలని నూపుర్ శర్మ కోరితే దానిపై నిర్ణయాన్ని పక్కనపెట్టి దేశంలో ఈ పరిస్థితికి కారణం ఆమేనంటూ నిందించడం ఏంటని వికాస్ మీడియోతో అన్నారు. వికాస్ ప్రారంభించిన పిటిషన్ కు 12 గంటల్లో 10వేల సైన్స్ వచ్చాయి.
అసలైన న్యాయమూర్తులు ఆ వ్యాఖ్యలు చేసిన తరువాతనుంచే నిరసనలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా తీవ్ర మైన స్పందన వచ్చింది.తాజాగా ఆ ఇద్దరు ఇద్దరు సిట్టింగ్ జడ్జీలపై అభిశంసనకు పార్లమెంటు సభ్యుల మద్దతును పిటిషనర్లు కోరారు.