2022 మేనెలలో జీఎస్టీ లక్షా 40వేల 885కోట్ల రూపాయలు వసూలైంది. జీఎస్టీ వసూళ్ల ప్రారంభంనుంచి 1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి. 2022 నుంచి వరుసగా మూడునెలలు రికార్డుస్థాయిలో వసూళ్లు జరిగాయి.
ఈ ఏడాది మే నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సీజీఎస్టీ వసూళ్లు 25 వేల కోట్ల రూపాయలు కాగా…. రాష్ట్ర వస్తు సేవల పన్ను, ఎస్జీఎస్టీ 32 వేల కోట్ల రూపాయలు, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఐజీఎస్టీ 73 వేల 345 కోట్ల రూపాయలుకాగా… సెస్ 10 వేల 502 కోట్ల రూపాయలు.
2022 మే నెల ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చిన 97 వేల 821 కోట్ల రూపాయల జిఎస్టి ఆదాయాల కంటే 44 శాతం ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2022 నెలలో ఉత్పత్తి అయిన మొత్తం ఇ-వే బిల్లుల సంఖ్య 7.4 కోట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది మార్చి 2022 నెలలో ఉత్పత్తి అయిన 7.7 కోట్ల ఇ-వే బిల్లుల కంటే 4 శాతం తక్కువ.