గుజరాత్ వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణాలను మరింత విస్తృతం చేసేందుకు బజరంగదళ్ ముందుకెళ్తోంది. ముఖ్యంగా సూరత్ లో అన్ని ప్రాంతాలకు లౌడ్ స్పీకర్లను అందజేయాలని నిర్ణయించింది. రోజూ రెండుసార్లు చాలీసా పారాయణంపై దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించాలని బజరంగ దళ్ భావిస్తోంది.
హిందువుల జనాభా తక్కువగా ఉన్న 21 ప్రాంతాలు సూరత్ లో ఉన్నాయి. అక్కడున్న అన్ని దేవాలయాల నుంచి చాలీసా వినిపించేలా లౌడ్ స్పీకర్లు అందజేయనున్నారు. వచ్చే రోజుల్లో పట్టణం నలుమూలలా ఈ ఏర్పాట్లు చేస్తామని…యాంప్లిఫయర్లు, టైమర్లు, స్పీకర్లు ఇవ్వనున్నారు. ఆజాద్ నగర్ వంటి ప్రాంతాల్లో ఇప్పుడు హిందువులు మైనారిటీలుగా ఉన్నారని… కానీ ఒకప్పుడు హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాలని బజరంగ దళ్ ప్రతినిధులంటున్నారు. అక్కడ నివసించే బీసీ కులాలు, దళితులకు లేనిపోనివి చెప్పి హిందువుల మధ్య చిచ్చురేపే ప్రయత్నం జరిగిందని…తరువాత అక్కడ ఆధిపత్య వర్గంగా ముస్లింలు ఏర్పడ్డారని స్థానిక బజరంగదళ్ వాళ్లంటున్నారు.