ది కాశ్మీర్ ఫైల్స్ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. వాస్తవ చరిత్ర ఆధారంగా రూపొందిన ఆ సినిమా జనాదరణ పొందుతుండడాన్ని సోకాల్ట్ లెఫ్టిస్టులు, ఉదారవాదులు తట్టుకోలేకపోతున్నారు. అన్నివిధాలా అసహనం ప్రదర్శిస్తున్నారు. తెరపై చూపించిందంతా వట్టిదేనంటూ ప్రచారం చేస్తున్నారు. నిన్న వికీపీడియా వంతైతే ఇవాళ IMDB అనే మూవీ రివ్యూ&రేటింగ్ సంస్థ తన నైజం బయటపెట్టుకుంది. అన్ని సినిమాలకు రేటింగ్, రివ్యూలు సమీక్షించే సంస్థ అది. అయితే కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని డౌన్‌గ్రేడ్ చేయడానికి IMDB తన వెబ్ సైట్ లో రేటింగ్ పద్ధతిని మార్చింది. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ను 9.9 రేటింగ్ నుండి 8.3కి తగ్గించింది.
“మా రేటింగ్ మెకానిజం ఈ శీర్షికపై అసాధారణ ఓటింగ్ చర్యలను గమనించింది, మా రేటింగ్ సిస్టమ్ విశ్వసనీయతను కాపాడేందుకు ప్రత్యామ్నాయ వెయిటింగ్ గణన పద్దతిని అనుసరిస్తున్నాం అటూ సమర్థించుకుంది.
సినిమా నిర్మాణంలో ఉన్నప్పటినుంచే అనేక అడ్డంకులు సృష్టిస్తూ వస్తున్నారు ఉదార వాదులు. తరువాత విడుదలను నిలిపివేయడానికి వామపక్షాలు సహా ఇస్లామిస్ట్ సంస్థలు అనేక ప్రయత్నాలు చేశాయి.
వికీపీడియా లెఫ్టిస్ట్ ఎడిటర్ల సహాయంతో ప్రతికూల ప్రతిస్పందనలను వికీ పేజీ లో పొందుపరిచింది. ఇక ఓ ప్రముఖ ఓటీటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రాన్ని తమ ప్లాటుఫారంలో విడుదల చేయాలంటే చిత్రంలో “ఇస్లామిక్ టెర్రరిజం” అనే పదాన్ని తొలగించమని తనను కోరినట్లు.. అలాగే “హిందూ టెర్రరిజం” అనే పదాన్ని వాడమని కోరినట్టు అగ్నిహోత్రి తెలపడాన్నిబట్టి వ్యతిరేక శక్తులు ఎలా ఏకమయ్యాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఆ ఓటీటీ పేరునూ, CEO పేరును వెల్లడించలేదు. సినిమా విడుదల కాకముందే ఎన్డీటీవీ దీనిని ప్రచార చిత్రంగా పేర్కొంది. బాలీవుడ్ చిత్రాలకు రివ్యూలను ఇస్తూ.. ప్రచారం చేసే ఫిల్మ్ కంపానియన్ సంస్థ కూడా ఈ చిత్రంపై సాధ్యమైనంత ప్రతికూల ప్రచారాన్ని చేసింది. ఈ ఫిల్మ్ కంపానియన్ సంస్థను దర్శకుడు విధు వినోద్ చోప్రా భార్య అనుపమ చోప్రా నడుపుతున్నారు. విధు వినోద్ కాశ్మీర్ పండిట్ల మారణహోమాన్ని కాస్తా ఒక లవ్ స్టోరీలా తీసి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)