
విచారణ వేగంగా జరిగి ఒక మైనర్ దోషిగా నిర్ధారించబడి, మే 17, 2018న దిగువ కోర్టు వాడికి మరణశిక్ష విధించింది.
జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం, 16 ఏళ్లు పైబడిన మరియు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఘోరమైన నేరానికి పాల్పడినట్లయితే, అతనిని లేదా ఆమెను పెద్దవారిగా విచారించబడతారు. బాలల న్యాయస్థానం (JJ చట్టంలోని సెక్షన్ 18) 3 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్షను విధించగలదు కానీ వారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించలేరు.
15వ తేదీ నవంబర్ 2018న మధ్యప్రదేశ్ హై కోర్ట్ కూడా దిగువ కోర్టు ఇచ్చిన మరణ శిక్ష ను ఖరారు చేసింది.
అయితే, ఈ హై కోర్ట్ తీర్పుపై నిందితుడు సుప్రీంకోర్టు కి వెళ్ళాడు.. అన్ని విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, సంజయ్ కరోల్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిందితుడు సాక్ష్యాధారాలు ప్రకారం నేరం చేసినట్లు రుజువయ్యింది. అందుకని ఇతను నేరస్తుడే. కానీ హైకోర్టు ఇచ్చిన శిక్ష ను కొట్టేస్తున్నాం. నేరస్తుడిని తక్షణమే విడుదల చేయాలి అని ఆదేశించింది.
ఈ తీర్పు ఇవ్వడానికి కల కారణాలు ఈ విధంగా చెప్పింది.
1. నేరం జరిగిన రోజుకు అతను మైనర్.. జువానైల్ చట్టం ప్రకారం మరణ శిక్ష వెయ్యలేం.
2. ఇప్పుడు నేరస్తుడికి 20 సం. లు కాబట్టి మళ్ళీ జువనైల్ అథారిటీ కి ఇతన్ని అప్ప చెప్పలేం.
3. నేరస్తుడు జ్యూడిషల్ కస్టడీ లో వున్నాడు కాబట్టి వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చాం.
ఇటువంటి తీర్పులపై ఎవరూ వాళ్ళను
ప్రశ్నించకూడదు….
ఒక వేళ ప్రశ్నిస్తే చట్టాల పుస్తకం లో ఉన్నట్లే
మేం తీర్పులు ఇవ్వగలం, కావాలంటే చట్టాలు
మార్చండి, మమ్మల్ని విమర్శించవద్దు అంటారు.
కానీ వాళ్ళకి ఇష్టం అయితే మేం ఇచ్చిన తీర్పుల ద్వారా మేము చట్టాలు చేయలేం అనే శంక చాలా చాలా సార్లు తీర్చేసాము అంటారు.
వాడు మైనర్ కాబట్టి వాడి పేరు, వాడి వివరాలు కూడా ఎక్కడా బయటకు రావు. ఒక మైనర్ గానే ఇంత రాక్షస నేరం చేసిన వాడిని మేజర్ గా సమాజంలోకి వదిలిన సుప్రీంకోర్టు ను ప్రశ్నించే వ్యవస్థ ఏదీ? మైనర్ గానే వాడు అంత భ్రష్టు పట్టిపోయి ఉంటే వాడు మేజర్ గా ఇంకెన్ని అఘాయిత్యాలు చేస్తాడో… ఆ పిల్ల తల్లి తండ్రులను ఇంత క్షోభ పెట్టిన న్యాయస్థానాల మీద సామాన్య ప్రజలకు గౌరవం ఉంటుందా?
న్యాయస్థానాలపై, వాటి తీర్పులు, వాటి ప్రవర్తన పై సోషల్ మీడియాలో సాధారణ పౌరులు విపరీతంగా స్పందిస్తున్నారు అని ఈ మధ్యనే చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ గారు ఆక్షేపించారు..
కానీ, మరి ఇటువంటి తీర్పులు వస్తున్నప్పుడు ప్రజలు స్పందించ కుండా ఎలా ఉండగలరు?
ఉన్నత న్యాయస్థాన తీర్పుపై ఈ పోస్ట్ లో పై కామెంట్స్ పెట్టినందుకు నన్ను కోర్టు ధిక్కరణ క్రింద బుక్ చేసినా నేను ఆశ్చర్యపోను…
…..చాడా శాస్త్రి….