విశ్వకవి రవీంద్రనాథ్ లండన్ లో కొంతకాలం పాటు నివసించిన ఇంటిని అమ్మకానికి పెట్టారు. 1912లో గీతాంజలిని ఇంగ్లిష్ లో అనువదించిన సమయంలో ఆయన అక్కడి హాంపస్టేట్ లోని హీత్ విల్లాలో నివసించారు. మమతా బెనర్జీ గతంలో యూకే వెళ్లినప్పుడు ఆ ఇంటిని సందర్శించిన సందర్భంగా దాన్ని కొనుగోలు చేసి మ్యూజియంగా మార్చేందుకు ఆసక్తి చూపారు. ఆ విషయమై ఇండియన్ హై కమిషన్ తో మాట్లాడారు కూడా. అప్పుడు అటునుంచి బదులురాలేదు. తమకు కావల్సిన అధిక ధర అంటూ ఇప్పుడు అమ్మకానికి సిద్ధమయ్యాడు ఎస్టేట్ ఏజెంట్. ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం కానీ, బెంగాల్ ప్రభుత్వం కానీ అంతగా ఆసక్తి చూపడం లేదు.