అగ్నిపథ్ అనే పథకం ద్వారా దేశంకోసం కొంతకాలం సేవచేసే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దానిపై నిరసనలూ వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ, బిహార్ వంటి పలుచోట్ల అభ్యర్థులు విధ్వంసకాండకూ తెగబడ్డారు.
అయితే రక్షణమంది రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్న నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా తాను సైన్యంలో చేరతానంటోంది.
ఈవిషయాన్ని గర్వంగా చెబుతూ సోషల్‌మీడియాలో షేర్ చేశారు రవి. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌లో భాగమవ్వాలని అనుకుంటున్నాను నాన్న అని నా బిడ్డ ఇషితాశుక్లా నాతో చెప్పింది. నేను సంతోషంగా సరే అన్నాను..’ అంటూ ట్వీట్ చేశారు.
मेरी बिटिया ईशिता शुक्ला ,आज सुबह बोली पापा I wanna b in #AgnipathRecruitmentScheme I said go ahead beta 🇮🇳 pic.twitter.com/BkxoOB81QQ
— Ravi Kishan (@ravikishann) June 15, 2022
రవి కిషన్ ‘రేసుగుర్రం’ వంటి పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం యూపీ గోరఖ్ పూర్ నుంచి బీజేపీ తరపున లోక్ సభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.