బెంగళూరు శివారుల్లో వీకెండ్ రేవ్ పార్టీ బట్టబయలు అయింది. ఇందులో అనేకమంది అనేకమంది తెలుగు సినిమా ప్రముఖులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వర్ధమాన హీరోయిన్స్ సహాయ నటులు పాలుపంచుకున్నారని చెబుతున్నారు. పోలీసుల సోదాలు సోదాలు మొదలు అవుతుండగానే వెనక డోర్ నుంచి ప్రముఖులను పంపించేసారని సమాచారం.
ఇప్పటిదాకా పోలీసులు కొంత సమాచారం మాత్రమే బయటపెట్టారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మద్యంతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన ఒక పారిశ్రామిక వేత్త కి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది.రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే పేరుతో పాస్ ఉన్న కారులు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు.
రేవు పార్టీ జరుగుతున్న ఫామ్ హౌస్ కి రెండు మూడు గేట్లు ఉన్నాయని చెప్తున్నారు. సోదాలు మొదలైనప్పుడే సినీ, రాజకీయ ప్రముఖుల్ని వెనుక గేట్ నుంచి పంపించి వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది తెలుగు సినీ తారల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీని మీద స్పందిస్తూ నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేశారు. బెంగళూరు పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఉన్నానని ఆమె చెబుతున్నారు.