అన్యాక్రాంతమైన దేవాలయ భూములు కాపాడేందుకు సంకల్పదీక్ష తీసుకుని పోరాటం చేస్తున్న తెలంగాణ వానరసేన బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. రాష్ట్రంలో కబ్జాకు గురైన ఆలయ భూముల విముక్తి కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
అనంతరం వానరసేన అధ్యక్షుడు రాంరెడ్డి మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ఆలయాలభూములు అన్యాక్రాంతం అయ్యాయని గుర్తు చేశారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర దేవదాయ శాఖకు సోయి లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. కోర్టులు సైతం పలుమార్లు చీవాట్లు పెట్టినా వైఖరి మార్చుకోవడం లేదని రాంరెడ్డి మండిపడ్డారు. పలుమార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికీ తీసుకెళ్లామని…మతతత్వ ఎంఐఎంతో అంటకాగుతున్న టీఆర్ఎస్ పార్టీ సైతం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.