ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులుగా మణిపూర్ అట్టుడుకుతోంది. మైటీలను ఎస్టీల్లో చేర్చాలనే ప్రతిపాదనను నిరసిస్తూ పలు గిరిజన సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా కుకీ వర్గం గిరిజనులు, గిరిజన హోదా డిమాండ్ చేస్తున్న మెయితీల మధ్య వార్ నడుస్తోంది. అదే డిమాండ్ తో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనయన్స్ చురాచాంద్ పూర్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీ హింసాత్మకమైంది. ఇంపాల్ వెస్ట్ , చురచాంద్ పూర్ , కంగ్ పోక్సీ, కక్చింగ్ తౌంబల్ , జిరిబామ్, బిష్ణు పూర్ జిల్లాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. మైటీ కమ్యూనిటీని ఎస్టీల్లో చేర్చే ప్రతిపాదనను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఇటీవల ఆదేశించడం పట్ల గిరిజన వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీస్ బలగాలతోపాటు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ భారీ సంఖ్యలో మోహరించాయి.
ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రం ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు మణిపూర్ ప్రభుత్వం తెలిపింది. నా రాష్ట్రం కాలిపోతుంది కాపాడాలంటూ లేడీ బాక్సర్ మేరీ కోమ్ ప్రధాని మోడీ కి ట్వీట్ చేశారు.
https://twitter.com/MangteC/status/1653871522011045888?s=20