మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగాగురువు రామ్ దేవ్ బాబా క్షమాపణ చెప్పారు. మహిళల సాధికారత కోసం తపించే వ్యక్తిని తానని చెప్పకొచ్చారు. మహారాష్ట్ర థానెలో ఓ కార్యక్రమంలో మహిళల వస్త్రధారణపై మాట్లాడారు రాందేవ్. మహిళలు చీరలో, సల్వార్ సూట్ లో అందంగా ఉంటారని అంటూ…మహిళలు ఏం ధరించకపోయినా బాగుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మహిళాసంఘాలు, నెటిజన్లు సహా అన్ని వర్గాలు ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాయి. మహారాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ. తన దిగజారుడు వ్యాఖ్యలపై రెండురోజుల్లో ఆయన వివరణ ఇవ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలి చకంకర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సైతం మండిపడ్డారు. రామ్ దేవ్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంతో రామ్ దేవ్ క్షమాపణ చెప్పారు. మహిళలంటే తనకెంతో గౌరవం అని, వారు గౌరవప్రదంగా వెలుగొందడం కోసం సదా శ్రమించేవాడిని తానని… తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణ చెప్పాలని రాందేవ్ అన్నారు.
అనుచిత వ్యాఖ్యలకు రామ్ దేవ్ క్షమాపణలు – మహిళలంటే తనకెంతో గౌరవం అన్న యోగా గురువు
Share: