హిందూదేవుళ్లను దూషిస్తూ..పిల్లలకు కూడా అదే చెప్పిన ఉపాధ్యాయుడు మల్లికార్జున్ ను సస్పెండ్ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో హిందూసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అనంతరం మండల ఎంఈవో కార్యాలయానికి చేరుకుని అధికారికి వినతిపత్రం అందజేశారు. హిందూదేవుళ్లను దూషించడమే కాక… తప్పు అని చెప్పిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టడమేంటని నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా సరే పోలీసులు కేసు నమోదుచేయకపోవడంపై వారు మండిపడుతున్నారు. మల్లికార్జున్ పై చర్యలు తీసుకోకుంటే ఆందోళనల్ని ఉధృతం చేస్తామని పటేల్ ప్రసాద్ సహా, పలువురు నాయకులు హెచ్చరించారు.