రాజస్థాన్లో పాక్ చొరబాటుదారుడిని మట్టుబెట్టిన బీఎస్ఎఫ్.
Rajasthan: A Pakistani intruder killed by BSF last night in Anupgarh after he was found doing suspicious activity at International border. When BSF challenged him, he tried to flee after which he was killed by troops. Body recovered & handed over to Police. Case registered.
— ANI (@ANI) March 6, 2021
రాజస్థాన్లోని అనూప్గర్హ్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దు గుండా.. దేశంలోకి చొరబడేందుకు పాక్కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. విషయం పసిగట్టిన బీఎస్ఎఫ్ అలర్ట్ అయ్యారు. అయితే బీఎస్ఎఫ్ సిబ్బంది కదలికలను గమనించిన పాక్ చొరబాటుదారుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. అనంతరం సంఘటనా స్థలికి చేరుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది.. దుండగుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.