బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు. మూడ్రోజుల క్రితమే అరెస్టైన రాజాసింగ్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పాతకేసుల్లో నోటీసులు ఇచ్చిన కొద్దిసేపటికే మంగళహాట్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం ఇంటికి వెళ్లిన పోలీసులు పాత కేసుల విషయంలో 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. కాసేపటికే అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆయన్ని రహస్యంగా గుర్తుతెలియని ప్రాంతానికి తరలించవచ్చని సమాచారం.
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ… ఓవ్యక్తి ఫిర్యాదుతో రెండ్రోజుల క్రితమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాజాసింగ్కు 14రోజుల రిమాండ్ విధించింది. అయితే సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 41సీఆర్పీసీ(CRPC) పాటించకుండా ఎలా రిమాండ్ చేస్తారని న్యాయవాది ప్రశ్నించారు. పాతకేసుల దృష్ట్యా బెయిల్ ఇవ్వవద్దని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాజాసింగ్కు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది. అయితే రెండురోజులకే పాతకేసులో మళ్లీ అరెస్ట్ చేశారు పోలీసులు.
https://twitter.com/ANI/status/1562746575310311424?s=20&t=2gi2PxNR6HFgGTbZ303Ohg
తాను అరెస్ట్ కావడానికి ముందు తన సోషల్ మీడియా ఖాతాలో వీడియోను విడుదల చేసిన రాజాసింగ్..
https://twitter.com/TigerRajaSingh/status/1562741379901829122?s=20&t=2gi2PxNR6HFgGTbZ303Ohg