ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణకు 8 ఏళ్లుగా కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ చేసిందేంలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం లాభపడింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగిందో ఆ పార్టీ చెప్పాలని నిలదీశారు. అన్నివిధాలా నష్టపోతున్న తెలంగాణ రైతుల పక్షాన మేముంటామని స్పష్టం చేశారు రాహుల్. రైతుల పక్షాన మేం ఉంటామని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వరంగల్లో రైతు సంఘర్షణ వేదిగ్గా రైతు డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ప్రసంగానికి ముందు….ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు. అంతకుముందు మాట్లాడిన పీసీసీ సారధి రేవంత్ రెడ్డి రైతులకు పలు హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణరైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ ను తొలగిస్తామని అన్నారు. అన్ని పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కౌలు రైతులకు ఏటా 15 వేలు, రైతు కూలీలకు ఏటా 12 వేలిస్తామని హామీ ఇచ్చారు., ఇందిరమ్మ భరోసా పథకాన్ని తీసుకువస్తామనీ అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై , టీఆర్ఎశ్ సర్కారుపై మండిపడిన రేవంత్ ..తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదని…తెలంగాణ అంటే పేగుబంధం, ఆత్మగౌరవం అనీ అన్నారు.