అనాలోచిత వ్యాఖ్యలతో భారత్ లో నిత్యం ట్రోల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. రాహుల్ నోటంట వచ్చే ప్రతీమాటతో పండగ చేసుకుంటారు నెటిజన్లు. ఇక పార్లమెంట్ వేదిగ్గా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ సర్కారుపై విమర్శలు చేస్తూ… ‘ ప్రధాని మోదీ విధానాల వల్లే పాకిస్తాన్, చైనాలు మునుపటికంటే సన్నిహితంగా ఉంటున్నాయి. అసలైతే ఆ రెండు దేశాలను కలవకుండా ఉంచాలన్నది భారత్ వ్యూహం” అని అన్నారు.
అయితే రాహుల్ వ్యాఖ్యలను తాము సమర్థించలేమంది అమెరికా. ‘పాకిస్తాన్, చైనాల మధ్య బంధం గురించి ఆ దేశాలకే వదిలేస్తున్నాం. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని మాత్రం సమర్థించలేం” అని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రెస్ అన్నారు.
https://twitter.com/ANI/status/1489062784306274307?s=20&t=Y5DgDcT0JOkV2DRvZK9zkg