సావర్కర్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటీషర్లకు వీరసావర్కర్ భయపడ్డారని..వాళ్లకు సేవకుడిగా పనిచేశారని రాహుల్ వ్యాఖ్యానించారు.అంతేకాదు తనకు క్షమాభిక్ష పెట్టాలని అర్జీలు పెట్టుకున్నారని రాహుల్ అన్నారు. తాను ధైర్యశాలి, సాహసికుడినని మరో పేరుతో తనగురించి తానే రాసుకున్నారనీ రాహులు సావర్కర్ గురించి వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర సర్కారు తనను అరెస్ట్ చేసుకోవచ్చని రాహుల్ తెగేసి చెప్పారు. అయితే రాహుల్ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అటు వీర సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యలను తప్పుపట్టారు మాజీసీఎం ఉద్ధవ్ ఠాక్రే. రాహుల్ వ్యాఖ్యల్ని సమర్థించబోనంటూనే బీజేపీపైనా మండిపడ్డారు. ఆయనకు ఎందుకు భారతరత్న ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
Veer Savarkar, in a letter written to the British, said "Sir, I beg to remain your most obedient servant" & signed on it. Savarkar helped the British. He betrayed leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru & Sardar Patel by signing the letter out of fear: Cong MP Rahul Gandhi pic.twitter.com/PcmtW6AD24
— ANI (@ANI) November 17, 2022
ఇక రాహుల్ పై మండిపడ్డారు సీఎం ఏక్నాథ్ షిండే. సావర్కర్ ను అవమానిస్తే మహారాష్ట్ర ప్రజలు సహించబోరన్నారు. అటు సావర్కర్ ను అవమానించిన రాహుల్ భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని ఎంపీ రాహుల్ షెవాలే డిమాండ్ చేశారు. గత వారం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారని గుర్తు చేశారు.
రాహుల్ వాఖ్యల పట్ల మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్ కు దేశ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర తెలియదని దుయ్యబట్టారు. తరచూ సావర్కర్ పై అవమానకర వాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ సావర్కర్ పై అనుచిత వాఖ్యలు చేస్తుంటే జోడో యాత్రలో ఆదిత్య థాకరే ఏవిధంగా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు.
ఇక సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యలపై వీరసావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘‘రాహుల్ గాంధీ సావర్కర్‌ను అవమానించడం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ సావర్కర్‌ను అవమానించారు. ఇక సహించలేది లేదు ’అని రంజిత్ చెప్పారు.