రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. నాందేడ్ జిల్లా దెగ్లూర్లోని మద్నూర్ నాకాలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో సాగింది. రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ప్రతినిధులు రాత్రి 10 గంటలకు యాత్రను ప్రారంభిస్తారు.ఈమేరకు రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్రలో 14 రోజుల పాటు భారత్ జోడో యాత్ర సాగనుంది. ఐదురాష్ట్రాల గుండా సాగుతూ 15 అసెంబ్లీ, ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలను ఆయన కవర్ చేయనున్నారు. మొత్తం 384 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్. నాందేడ్, హింగోలి, వాసిం, అకోలా, బుల్దానా జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుంది. అకోలా జిల్లాలోని యాత్ర మార్గంలో మాత్రం రాహుల్ కార్లో ప్రయాణిస్తారు.
https://twitter.com/INCMaharashtra/status/1589555029723484160?s=20&t=YTjD3qYDPM0xrFOFYb3pTQ
మహారాష్ట్రలో బీజేపీకి, షిండే తో పాటు ఎంఎన్ఎస్ కు చెక్ పెట్టాలంటే మహావికాస్ ఆఘాడీ బలపడాల్సి ఉందని..అందుకే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని నిర్ణయించినట్టు పార్టీ తెలిసింది. ఆదిత్య ఠాక్రేతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైత్ రాహుల్ యాత్రలో పాల్గొంటారు.అందుకు ఏర్పాట్లు కూడా చేసింది పార్టీ.
శివసేన, ఎన్సీపీ సైత్ యాత్రలో పాల్గొననుంది. శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్యఠాక్రే రాహుల్ తో కలిసి నడుస్తారు. శరత్ పవార్ కూడా యాత్రలో పాల్గొంటారు. అయితే ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నందున..ఒక కిలోమీటరు దూరం నడుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర వచ్చే ఏడాది కాశ్మీర్లో ముగుస్తుంది. భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. రాష్ట్రానికి చెందిన వివిధ రంగా ప్రముఖులు, సామాజిక ఉద్యమకారులు రాహుల్ తో కలిసి నడవనున్నారు.