జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రవర్తన మీద చర్చ జరుగుతోంది ప్రపంచ దేశాలలో భారతదేశం పరువు తీసే విధంగా రాహుల్ గాంధీ ప్రకటనలు చేయడం గమనించాల్సిన విషయం . భారత దేశంలో ప్రజాస్వామ్యమే లేదని ఎన్నికల సంఘం పూర్తిగా అమ్ముడుపోయిందని ఆయన పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక కొన్ని విదేశీ శక్తులు ఉన్నాయి అనే మాట బలంగా వినిపిస్తోంది.
……
ప్రపంచ దేశాలలో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం మీద అభిప్రాయం మారిపోయింది. భారత్ కు, అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పేరు వస్తున్నది. ఇది చూసి తట్టుకోలేని కొన్ని విదేశీ శక్తులు రాహుల్ గాంధీని వాడుకుంటున్నాయి అని తెలుస్తోంది. అందులో భాగంగానే భారత్ లో ప్రజాస్వామ్యం లేదని ,, ఎన్నికల ప్రక్రియ అమ్ముడుపోయిందని రాహుల్ ఆరోపణలు చేయడం. ఈ ఆరోపణలకు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం కల్పిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాలలో భారత్ పరువు తీసేయడమే ఈ విదేశీ శక్తుల లక్ష్యంగా కనిపిస్తోంది.
……..
ఇటీవల ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ కర్నాటకలో ఓట్లను చోరీ చేశారంటూ.. రాహుల్ గాంధీ ప్రజంటేషన్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందని.. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నకిలీ ఓటర్లతో బీజేపీకి లబ్ధి చేకూర్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ ఇందుకు స్పష్టమైన ఆధారాలు ఏమీ రాహుల్ గాంధీ బయట పెట్టకపోవడం విశేషం.
…..
ఈ క్రమంలోనే రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయన వ్యాఖ్యలను అసంబద్ధమైన విశ్లేషణగా పేర్కొంది. తప్పుదోవ పట్టించే వివరణలు వ్యాప్తి చేసినందుకు రాహుల్ ప్రమాణపూర్వక ఫిర్యాదు సమర్పించాలని లేదంటే దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
…….
అయితే రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇవ్వగా.. ఆయన స్పందించకపోవడంతో ఎన్నికల సంఘమే స్వయంగా ఫ్యాక్ట్ చేసి వివరాలను విడుదల చేస్తోంది. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ తాజాగా చేసిన ఓట్ల చోరీ ఆరోపణల్లో ఒకటైన బెంగళూరు వృద్ధురాలి ఓట్ల నమోదుపై ఈసీ ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది. అక్కడ ఎటువంటి అవకతవకలో జరగలేదని స్పష్టంగా ఈసీ రుజువు చేసింది.
అంతిమంగా రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే విషయం నిర్ధారణ అయింది.
……..
దీనిని బట్టి విదేశీ శక్తుల చేతిలో రాహుల్ గాంధీ కీలుబొమ్మగా మారారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి వాటి పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.