నేషనల్ హెరాల్డ్ కేసు లో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బండారం బట్టబయలు అయింది. ఈ ఇద్దరి మీద కొత్త ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. వేల కోట్ల రూపాయిలు కొట్టేశారని తెలియటంతో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి.
…………………….
నేషనల్ హెరాల్డ్ స్కామ్ భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా నిలిచింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ను నడిపేందుకు వంద సంవత్సరాల క్రితమే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటు అయింది. స్వాతంత్రానికి ముందు, తర్వాత కాంగ్రెస్ నాయకుల ద్వారా దేశ వ్యాప్తంగా ఆస్తులు, భవనాలు సమకూర్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వం దానిని నష్టాల్లోకి నెట్టేసింది. యంగ్ ఇండియా అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసి, ఆ సంస్థకు AJL షేర్లను మార్చేశారు. యంగ్ ఇండియా లో సోనియా, రాహుల్ గాంధీలకు 76 శాతం వాటా ఉంది. కేవలం 50 లక్షలు చెల్లించి, 2 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కొట్టేశారు. ఇది పేపర్ల మీద స్పష్టంగా కనిపిస్తున్న లావాదేవీ.
…………………………………..
ఇప్పటికే ఈ స్కామ్ వివరాలు పూర్తిగా బయటకు వచ్చేశాయి. కానీ ప్రతీసారి, కాంగ్రెస్ నేతలు రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. కక్ష సాధింపు అనే పేరుతో సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి మాత్రం పూర్తి వివరాలు బయటకు వచ్చేశాయి. దీంతో సోనియ, రాహుల్ జైలుకి వెళతారు అన్న మాట గుప్పుమంటోంది.




